వి.ఆర్.పురం
ఏపీ జేఏసీ, ఏపీ యూటీఎఫ్ పిలుపు మేరకు ఉద్యోగుల సమస్యల సాధనకు, శుక్రవారం వి ఆర్ పురం మండలంలొని పాఠశాలలో నల్ల రిబ్బన్ లు దరించి యూటీఎఫ్ ఉద్యోగులు తమ నిరసన తెలియ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు బాకయి పడ్డ 25 వేల కోట్ల ను తక్షణమే చెల్లించాలని, మధ్యంతర భృతి ని 30 శాతం పెంచాలని, పాత పెన్షన్ విధాన్నాన్ని అమలు చేయాలనీ, అలాగే 1 తేదినాడే జీతాలు చెల్లించాలని, మధ్యాహ్న భోజన సమయం లో సమస్య లు సాధన కై వి ఆర్ పురం మండల పాఠశాలలో నల్ల రిబ్బన్ లు దరించి నిరసన తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వి ఆర్ పురం మండల అధ్యక్షులు కె వెంకట్, ప్రధాన కార్యదర్శి యన్ జగదీష్, జిల్లా కార్యదర్శి యస్ నాగేశ్వరరావు, యూటీఫ్ సభ్యులు ఎన్ ప్రసాద్. వీరయ్య, రామకృష్ణ, అజయ్, రాము, రమేష్, శాంతి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.