ట్రాఫిక్ సి. ఐ సురేష్ రెడ్డి
పులివెందుల :ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా వాహనాన్ని నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి అని ట్రాఫిక్ సీఐ సురేష్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సీఐ సురేష్ రెడ్డి నలంద కళాశాల విధ్యార్థులకు హెల్మెట్ వాడకము, ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఆయన విద్యార్థులకు సూచించారు.వాహనాలు నడిపే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు, కారు డ్రైవర్లు సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంద న్నారు.ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం వహించరాదన్నారు ముఖ్యంగా విద్యార్థు లు త్రిబుల్ రైడింగ్ చేయరాదన్నారు.ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్,అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.