Wednesday, November 12, 2025

Creating liberating content

తాజా వార్తలుదొంగలే దొంగ..దొంగ..అని అరుస్తున్నారు

దొంగలే దొంగ..దొంగ..అని అరుస్తున్నారు

దొంగ పాలకులను రానున్న ఎన్నికల్లో ఓడించాలి

  • నూజివీడు పర్యటనలో భువనేశ్వరి వ్యాఖ్య

ఆగిరిపల్లి:వైసీపీ పాలనలో దొంగలే దొంగ…దొంగ..అని అరుస్తున్నారని, అమాయకులను, ప్రతిపక్ష నేతలను కక్షపూరితంగా దొంగలుగా చిత్రీకరించేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. నూజివీడు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటనలో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన అనంతరం తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలు, పార్టీ అభిమానులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడుతూ….
• గంజాయి, డ్రగ్స్, ఇసుకమాఫియా, భూకబ్జాలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న వారు..తమను ప్రశ్నించే వారిని దొంగలుగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
• వైసీపీ అక్రమార్జనను నిలదీస్తున్నారనే కక్షతో ఆధారాలు లేని తప్పుడు కేసులో ఇరికించి రూ.3వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించి నేడు రూ.27కోట్లు అని చెబుతున్నారు. కానీ నేటికీ చంద్రబాబు ప్రజాధనాన్ని దోచుకున్నారని నిరూపించలేదు.
• వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని గంజాయి మత్తులో ముంచుతున్నారు. మహిళలకు కూడా వైసీపీ నాయకులు గంజాయిని అలవాటు చేసి ఆ మత్తులో వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది.
• చిత్తూరుజిల్లా, పూతలపట్టు నియోజకవర్గంలో హంసవేణి అనే మహిళ నీళ్లు కావాలని అడిగినందుకు ఆమె రెండుకళ్లను వైసీపీ కిరాతకులు పీకేశారు. నేడు హంసవేణి కుటుంబాన్ని పోషించేవారు లేక వాళ్లు అనాధలయ్యారు.
• రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు లేక చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు.
• చంద్రబాబు పాలనలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి ప్రోత్సహించారు.
• వైసీపీ పాలనలో ఏపీకి ఒక్క పెట్టుబడి లేదా కంపెనీ రాలేదు..టీడీపీ పాలనలో వచ్చిన కంపెనీలన్నీ ఏపీని వదిలి ప్రక్కనున్న రాష్ట్రాలకు పారిపోయాయి. దీనివల్ల యువతకు ఉద్యోగావకాశాలు పోయాయి.
• చంద్రబాబు నిర్మించిన అమరావతిని వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసింది..మూడు రాజధానులు పెడతామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం కనీసం ఒక్క రాజధాని కూడా ఏపీకి లేకుండా చేసి అవమానపరుస్తున్నారు.
• అమరావతికి భూములిచ్చిన రైతులపై వైసీపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించింది. మహిళలు అని కూడా చూడకుండా అమరావతి రైతులను పోలీసులతో కొట్టించారు. అయినా వాళ్లు ఎక్కడా వెనక్కి తగ్గకుండా 1,600రోజులుగా తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
• రాష్ట్రం బాగుండాలంటే..భావితరాల భవిష్యత్తు నిలబడాలంటే…మహిళలకు రక్షణ కావాలంటే…చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి.
• ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఆ కుటుంబానికి పెద్దదిక్కు ఎంత అవసరమో…ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం కూడా అంతే అవసరం.
• మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు…అధికారంలోకి వచ్చాక వాటిని తప్పకుండా అమలు చేస్తారు.
• దొంగల పాలనను అంతం చేయాలంటే రాష్ట్రంలోని పౌరులందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి..టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి అని భువనేశ్వరి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article