జీలుగుమిల్లి
దేశంలో శాంతి సుఖ సంతోషాలు పుష్కలంగా ఉండాలంటూ వివిధ ప్రార్ధన మందిరాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహింపజేశారు ఈ ప్రార్థనలో అనేకమంది పాల్గొన్నారు. మండల వ్యాప్తంగా అనేక ఏసుక్రీస్తు దేవాలయాలు సంఘస్తులు పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
జీలుగుమిల్లి మండలం జీలుగుమిల్లి గ్రేస్ మందిర్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ క్షేమం కొరకు,రక్షణ కొరకు, సమాధానం కొరకు, నాయకుల కొరకు, ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని, పాస్టర్ బి. ఎజ్రాశాస్త్రి, నిర్మల శాస్త్రి, పాస్టర్ కె వై రత్నం, సంఘ విశ్వసులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.