ఒంటిమిట్ట:
జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఒంటిమిట్ట సిద్ధవటం మండలాల్లోని టి షాపులవారు, జనాలు అధికంగా గుమిక్యుడే దుకాణదారులు స్వచ్ఛందంగా మూసివేయాలని సిఐ పురుషోత్తం రాజు, అన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని దుకాణదారులు వ్యాపారులు ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని ఆయన అన్నారు ఎవరైనా గొడవలకు దిగితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఒంటిమిట్ట ఎస్సై మధుసూదన్ రావు, సిద్ధవటం ఎస్ఐ పెద్ద ఓబన్న, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.