రేణిగుంట:రేణిగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ నిరుపేద కుటుంబానికి చెందిన టైలర్ మునస్వామి (65) సోమవారం మృతి చెందడంతో ఈ సమాచారాన్ని వైయస్సార్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.మృతుడి కుటుంబానికి అన్నివేళలా అందుబాటులో ఉంటామని దహన సంస్కారాలకు మృతుడి కుటుంబ సభ్యులకు పది వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్,వార్డు మెంబర్లు ఇంద్రమ్మ,ఇన్బ నాథన్, నాయకులు రవి, గోపి తదితరులు పాల్గొన్నారు.