కలసపాడు తాసిల్దార్ కు ఫిర్యాదు చేసిన దళితులు
కలసపాడు
కలసపాడు మండలంలోని తెల్లపాడు గ్రామపంచాయతీ లోని దూలం వారి పల్లె గ్రామానికి చెందిన భూమి లేని నిరుపేదలైన దళితులకు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరియు అప్పటి శాసనసభ్యులు బీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో దళితులకు సుమారు వంద మందికి పైగా భూమి పట్టాలు మంజూరు చేసి హక్కు పత్రాలను ఇవ్వడం జరిగింది. అయితే భూస్వాములు అగ్రకులాలకు చెందిన వారు పేదల భూములపై కన్నేసి వారి భూములను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని దురుద్దేశంతో దళితుల భూములను దౌర్జన్యంగా అక్రమంగా స్వాధీనం చేసుకొని డోజర్లతో చదును చేసుకున్నారు . ఈ విషయం తెలుసుకున్న దళితులు వారి వద్దకు వెళ్లి మా భూములను ఆక్రమించుకోవడం అన్యాయమని మా పేదల భూములే మీకు దొరికాయా మీ భూములను మీరు ఇతరులకు ఇస్తున్నారా అంటూ నిలదీశారు.ఇటీవల అగ్రకుల భూస్వాములు మా భూములను స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశంతో దళితుల భూములను ఆక్రమించుకున్నారు. ఈ విషయంపై దూలవారిపల్లె ఎస్సీ దళితులు సోమవారం కలసపాడు మండల డిప్యూటీ తాసిల్దారు కు వినతి పత్రం సమర్పించారు. మా భూములు ఆక్రమించుకున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మా భూములు మాకు ఇప్పించాలని వారు పేర్కొన్నారు.