కడప అర్బన్ :డెంటల్ సర్జన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా కడప నగరానికి చెందిన సంఘం డెంటల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ షేక్ నాజిముద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో కడప డెంటల్ సర్జన్ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా ఈయన విశేష సేవలు అందించారు. డెంటల్ సర్జన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా తిరిగి రెండోసారి ఎన్నిక కావడం పట్ల జిల్లాకు చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు. కడప డెంటల్ సర్జన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ సుభద్ర, ఆ సంఘం నాయకులు డాక్టర్ చిన్ని సంపత్ లు డాక్టర్ నాజీముద్దీన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ నాజిముద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో దంత వైద్యుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వంతో చర్చించి వాటి పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. తనకు అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు