తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సెక్రెటరీ అనితారామచంద్రన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులుగా పాల్వాయి రజనీకుమారి, అనితారాజేంద్రతో మహేందర్రెడ్డి ప్రమాణం చేయించారు. కొత్తగా చైర్మన్ నియమితులైన మహేందర్రెడ్డి ఆ పదవిలో 11 నెలల పాటు కొనసాగనున్నారు.