హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన్నాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవేశపెట్టారు. శాసన మండలిలో గందరగోళం నెలకొంది. మండలి సభ్యులపై సిఎం అనుచిత వ్యాఖ్యలు చేశాంటూ మండలి సభ్యులు నిరసనకు దిగారు. సిఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో సభను మూడుసార్లు వాయిదా వేశారు. సిఎం క్షమాపణ చెప్పాలంటూ ఆందోళనకు దిగారు. కౌన్సిల్ హాల్ ముందు నల్ల కండువాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బైఠాయించారు. మరోవైపు బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు నిరసన తెలిపే హక్కు లేదని మంత్రి జూపల్లి అన్నారు.