Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుఢిల్లీలో చేపట్టిన ధర్నాలో పాల్గొన్నా: లక్ష్మీనారాయణ

ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో పాల్గొన్నా: లక్ష్మీనారాయణ

అమరావతి:ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో తాను కూడా పాల్గొన్నానని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల డిమాండ్ ల అమలుకు చర్యలు తీసుకునేలా గవర్నర్ ను డిమాండ్ చేస్తున్నామని, ఆ మేరకు వినతిపత్రం సమర్పించామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన సదస్సులోనూ పాల్గొన్నానని లక్ష్మీనారాయణ వివరించారు. జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, స్టీల్ ప్లాంట్ అంశాలపై స్పందించారు. రాష్ట్ర విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. దీనిపై లక్ష్మీనారాయణ ఇవాళ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article