Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుడ్వాక్రా గ్రూపులకు ఆడిటింగ్ పేరుతో భారం మోపడం తగదు

డ్వాక్రా గ్రూపులకు ఆడిటింగ్ పేరుతో భారం మోపడం తగదు

ఏఐటీయూసీ

కడప సిటీ

స్వయం పొదుపు సంఘాలుగా ఏర్పడి బ్యాంకుల సహాయంతో ఉపాధి పొందుతున్న డ్వాక్రా సంఘాలపై ఆడిటింగ్ పేరుతో భారాలు మోపాలనే ఆలోచనను మెప్మా, వెలుగు డిపార్ట్మెంట్ అధికారులు విరమించుకోవాలని ఎఐటియుసి జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేసి. బాదుల్లా విజ్ఞప్తి చేశారు.మంగళవారం స్థానిక హోచిమిన్ భవన్ యందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాదుల్లా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అని చెప్పేమెప్మా,వెలుగుడిపార్ట్మెంట్ అధికారులు సర్కులర్ కానీ, మెసేజ్ గాని ముందస్తు చెప్పా పెట్టకుండాఆర్పీల,యానిమేటర్ల పై 2015 సంవత్సరం నుంచి డ్వాక్రా గ్రూపులకు వారంలోగా ఆడిటింగ్ పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకురావడం వెనుక ఆంతర్యం ఏమిటోఅర్థంకావడం లేదన్నారు.ఎన్నికలనోటిఫికేషన్ వస్తున్నసందర్భంలోహడావుడిగాడ్వాక్రాగ్రూపులుదగ్గరదాచుకుని ఉన్న డబ్బులు వివరాలు ఎందుకుతెలుసుకోవాల్సివస్తుందో అధికారులు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
ఆడిటింగ్ కూడా ఒక్క ఆడిటర్ దగ్గరనే చేయించాలని డ్వాక్రా గ్రూపు నుంచి 250రూపాయలు డబ్బులు వసూలు చేయాలని, 2015 సంవత్సరము నుంచి బ్యాంకు స్టేట్మెంట్ కొరకు 1000 రూపాయలుఖర్చుఅవుతుందని జిల్లాలో సుమారుగా 7500 గ్రూపులుసంబంధించినడబ్బులు ఎవరి ప్రయోజనాల కొరకు ఖర్చవుతున్నట్లు,డ్వాక్రా గ్రూపుల మహిళలుకు పలు అనుమానాలకు తావిస్తున్నదని తెలిపారు.
మహిళలను కూడగట్టి, పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి వాటి బాధ్యతలను నిరంతరం శ్రద్ధతో నిర్వహిస్తున్నారని, 18 రకాల మొబైల్‌ యాప్స్‌ ద్వారా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వర్క్‌తో పనిభారం తీవ్రమైందని పేర్కొన్నారు.
మొబైల్స్‌, నెట్‌ బ్యాలెన్సు ఇవ్వకపోవడంతో సొంత డబ్బులే ఖర్చు చేస్తున్నారని, డ్వాక్రా సభ్యులతో మహిళా మార్టుల్లో సరుకుల కొనుగోళ్లకు టార్గెట్స్‌ పెట్టి విఒఎలతో బలవంతపు అమ్మకాలు చేయిస్తున్నారని అన్నారు. ఆర్‌పిలకు వేతన గ్యారెంటీ కూడా లేదని, పెర్ఫార్మెన్స్‌ పేరుతో కొద్ది అమౌంట్‌ మాత్రమే చేతిలో పెడుతున్నారని వివరించారు.
బ్యాంకు అకౌంట్‌ సరిగ్గా లేవన్న పేరుతో గత ఏడు నెలల నుంచి డ్వాక్రా గ్రూపులకు ఇచ్చిన లోన్ల ఆన్లైన్ చేయించకుండా వీరికి భవిష్యత్తులో వచ్చే రుణమాఫీ అర్హత లేకుండా చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా రెండున్నరవేల మందికి చాలా కాలంగా వేతనాలు వేయలేదని, ఆ బకాయిలు చెల్లించాలని, పొదుపు సంఘాలకు రూ.5 లక్షలకు వడ్డీ రాయితీ ఇవ్వాలని, రూ.20 లక్షల వరకు సున్నా వడ్డీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. డ్వాక్రా సభ్యులతో బలవంతపు కొనుగోళ్లు చేయించొద్దని హితవు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article