రామచంద్రపురం నియోజకవర్గ పరిస్థితిపై ఆరా సీనియర్లకు ఎప్పుడూ పార్టీలో సముచిత స్థానం
రామచంద్రపురం
ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో టీడీపీ ఒకపక్క అసెంబ్లీ టిక్కెట్లు విషయంలో ఆచుతూచి నిర్ణయం తీసుకోనుండగా మరో పక్క పార్టీలో తటస్థంగా ఉన్న నేతలపై దృష్టి పెట్టింది.ఇందులో బాగంగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఇటీవల వర్గవిబేధాలు కారణంగా ఇప్పటి వరకు తటస్థంగా ఉన్న పలువురు నేతలకు మంగళగిరి ప్రధాన కార్యాలయం నుండి పిలుపు రావడంతో పలువురు టీడీపీ సీనియర్ నేతలు శుక్రవారం మంగళగిరి తరలివెళ్ళారు. దీంతో అక్కడకు వెళ్ళిన వారితో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చం నియోజకవర్గం పరిస్థితిపై ఆరా తీసి అక్కడ పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.అలాగే రామచంద్రపురం నుండి తరలివెళ్ళిన నేతలు సైతం తమ మనోబావాలను పార్టీ అద్యక్షులు ముందు ఉంచడంతో విషయం గ్రహించిన రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు స్పందించి పార్టీకి సేవలందించిన ప్రతీ ఒక్కరికీ పార్టీలో తగిన గుర్తింపు తోపాటు సముచిత స్థానం ఎప్పుడూ ఉంటుందని బరోసా ఇచ్చినట్లు మంగళగిరి వెళ్ళిన టీడీపీ సీనియర్ నేత,మాజీ జెడ్పీ వైఎస్ చైర్మన్ , చింతపల్లి వీరభద్రరావు తెలిపారు .మంగళగిరి వెళ్లిన వారిలో టీడీపీ నేతలు రామచంద్రపురం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ,కె.గంగవరం మాజీ జెడ్పీటీసీ మేడిశెట్టి రవికుమార్, నండూరి ఫణికుమార్, కొత్తపల్లి శ్రీను, కాజులూరు మండల టీడీపీ మాజీ అద్యక్షులు సలాది సాయిబాబా,బలుసు శివప్రసాద్ ,మరివాడ చిన్ని కృష్ణ, జగత రమణ, నందికోళ్ల అన్నవరం తదితరులు ఉన్నారు.