తుని,: ప్రతి నిరుపేద భవిష్యత్తుకు చంద్రబాబే గ్యారెంటీ అని తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యనమల దివ్య అన్నారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా ఇవాళ తుని పట్టణంలోని 13వ వార్డులో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడుతో కలిసి ఆమె పర్యటించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన కార్యకర్తలతో కలిసి బాబు ష్యూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లిన జననేత్రి యనమల దివ్య మహిళలు మంగళహారతలతో ఘన స్వాగతం పలికారు. వార్డులో విస్తృతంగా పర్యటించిన యనమల దివ్య స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైకాపా పాలలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్టుగా ఉందని.. వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. అదేవిధంగా ఇంటింటికి వెళ్లిన యనమల దివ్య బాబు ష్యూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కింద అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ అందుకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓటమి తప్పదని… చంద్రబాబు నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు పోల్నాటి శేషగిరిరావు మోతుకూరి వెంకటేష్ చోడిశెట్టి గణేష్ మళ్ల గణేష్ కుక్కడపు బాలాజీ ,దిబ్బ శ్రీను, శిల్పరశెట్టి జగన్మోహన్ ,అల్లురాజు,మామిడి దాసు తదితరులు పాల్గొన్నారు

