ఏలేశ్వరం:
ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వరుపుల సత్యప్రభ తీరుకు నిరసనగా ఏలేశ్వరంలో ఆ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సతివాడ రాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ ఊపిరిగా కొనసాగుతున్న స్థానిక నాయకులు కార్యకర్తలను విస్మరించి ఇటీవల వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలోకి వలస వచ్చిన చోటా మోటా నాయకులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అని ఆరోపించారు. పట్టణంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు మాకు సమాచారం ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ఇన్చార్జ్ ఇప్పటికైనా ఆధిపత్యం ధోరణి మానుకోవాలన్నారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని కలిసి ఇన్చార్జి పై ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉంటున్న కార్యకర్తలను పక్కనపెట్టి వైసీపీ పార్టీ వాళ్ళతో కలిసి కార్యక్రమాలు చేయడంపై మండిపడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో పైల అయ్యప్ప,9వ వార్డ్ మాజీ కౌన్సిలర్ శిడగం కన్నారావు,వాగు రమేష్,రాయడు చిన్న,ముచ్చి అప్పలరాజు ,చింతల పాండవలు,రొట్ట వీర్రాజు, కరౌతు గణేష్ గారు, పొట్నూరి అప్పారావు, శిడగం రామ కృష్ణ,కోట్ల కృష్ణ, తదితర పార్టీ కార్యకర్తలు ఉన్నారు.