రాప్తాడు :రాప్తాడు నియోజకవర్గ కేంద్రానికి చెందిన వైకాపా నాయకులు మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు గ్రామానికి చెందిన తలారి శివ, మాజీ సర్పంచ్ మాన్లుకోసే గౌరమ్మ రామాంజనేయులు కుమారుడు మాన్లుకోసే కేశవ తో పాటు చెన్నేకొత్తపల్లి మండలం, బసంపల్లి గ్రామానికి చెందిన జి.నగేష్, కే.కొండయ్య, జి. చెన్నకేశవులు మరియు ప్యాదిండి గ్రామానికి చెందిన ఓబుళపతి, లక్ష్మీపతి, నారాయణ, కుళ్లాయప్ప, దుర్గప్ప తదితర 10కుటుంబాలవారు తెలుగుదేశం పార్టీలో చేరారన్నారు. తెలుగుదేశం పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.