వేంపల్లె
మంగళవారం వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ గ్రామపంచాయతీ వైఎస్ఆర్సిపి నుండి టిడిపి పార్టీ కార్యాలయంలో ఇడుపులపాయ బూతు ఇంచార్జ్ పీపీ చెన్డ్రాయుడు, యూనిట్ ఇంచార్జ్ పోతిరెడ్డి శివ ఆధ్వర్యంలో ఇడుపులపాయ పంచాయతీలోని వైయస్సార్సీపి కి సంబంధించిన 15 కుటుంబాలు పులివెందుల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి సమక్షంలో టిడిపి పార్టీలో చేరడం జరిగింది. బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి, వేంపల్లి మండల పరిశీలకులు రఘునాథ్ రెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. చేరిన వారిలో మారుతి నగర్ లోని పెద్దింటి వెంకటరత్నం, పెద్ద కులయప్ప, ఇడుపులపాయ గ్రామం నుంచి పోతిరెడ్డి చంద్రశేఖర్, వేముల చినరాయుడు, వీరన్నగట్టుపల్లి గ్రామం నుంచి ఎద్దుల సాయి, వేమ నారాయణ, షేక్ వల్లి, మామిళ్ళ గంగులయ్య తదితర కుటుంబాలు వారు కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ రామముని రెడ్డి, మహమ్మద్ షబ్బీర్, మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్, వెంకటస్వామి, ఎస్వీ రమణ, ఎస్సీ సెల్ కార్యదర్శి ఈశ్వరయ్య, మడక శ్రీను తదితరులు పాల్గొన్నారు.

