పులివెందుల
పులివెందుల పట్టణంలోని ఎర్రగుడిపల్లి కి చెందిన నర్సింహులు టిడిపిలో కొనసాగుతుండగా సోమవా రం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించిన వైయస్ మనోహర్ రెడ్డి, చైర్మన్ వరప్రసాద్, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ గంగాధర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ బొగ్గిటి పురుషోత్తం, డేనియల్ బాబులఆధ్వర్యంలో టిడిపిని వీడి వైకాపా తీర్ధాన్ని నరసింహ కుటుంబ సభ్యులు పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ ముఖ్య మంత్రి ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కటి మాకు అందాయని, ఇలాంటి పథకాలు మళ్లీ అందాలంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకే టిడిపిని వీడి వైకాపాలో పార్టీలో చేరినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోళ్ల భాస్కర్, సూరి, కృష్ణమూర్తి, దాసరిచంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.