Sunday, February 15, 2026

Creating liberating content

Uncategorizedటిటిడి ఈవో ధర్మారెడ్డిని, చైర్మన్ కరుణాకర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే డాక్టర్ సుధా బండి నర్వ...

టిటిడి ఈవో ధర్మారెడ్డిని, చైర్మన్ కరుణాకర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే డాక్టర్ సుధా బండి నర్వ దేవాలయ కమిటీ సభ్యులు

పోరుమామిళ్ల:
టిటిడి ఈవో ధర్మారెడ్డిని, చైర్మన్ కరుణాకర్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా పోరుమామిళ్ల బండి నర్వ దేవాలయ కమిటీ సభ్యులు తిరుమలలో కలిశారు. ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి సూచన మేరకు బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కరెంటు రమణారెడ్డి, కమిటీ అధ్యక్షులు పంగా గురివిరెడ్డి, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు ఫణిరావుశర్మ, రిటైర్డ్ ఏఎస్ఐ గంగన్న, సీడ్స్ రామసుబ్బారెడ్డి రామకృష్ణారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా పోరుమామిళ్లలో బండి నర్వ దేవాలయం నిర్మాణానికి 6 కోట్ల నిధులను మంజూరు చేయాలని టిటిడి ఈవో, చైర్మన్ లకు వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. అంత పెద్ద అమౌంట్ ఇవ్వడం కష్టమని దేవాలయ నిర్మాణానికి మావంతు సహకారం అందిస్తామని వారు తెలిపారని కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article