లేపాక్షి:-మండల కేంద్రమైన లేపాక్షి నుండి అనంతపురంలో జరిగే జిల్లా మహాసభలకు మండల రజక సోదరులు బస్సులో బయలుదేరి వెళ్లారు. బస్సు ను ఏర్పాటు చేయడంతో పాటు ఖర్చులకు 15 వేల రూపాయలను రజక సోదరులకు పంపించారు. అదేవిధంగా తెలుగుదేశం నాయకులు ప్రభాకర్ రెడ్డి ఉదయం మహాసభలకు బయలుదేరి వెళుతున్న రజక సోదరులకు అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ జయప్ప మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పాలనలో వెనుకబడిన వర్గాల వారి అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల అభివృద్ధి జరిగిందన్నారు. అందులో భాగంగానే రజక సోదరులకు ఎమ్మెల్యే బాలకృష్ణ ఆర్థిక సహకారం అందజేశారన్నారు. అనంతరం నంది విగ్రహం ముందు జండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆనంద్ కుమార్, టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు రవి, తెలుగుదేశం పార్టీ నాయకులు కోడి పల్లి నాగరాజు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.