Thursday, September 18, 2025

Creating liberating content

తాజా వార్తలుజవహర్ నవోదయ పాఠశాలకు 9 మంది విద్యార్థులు ఎంపిక

జవహర్ నవోదయ పాఠశాలకు 9 మంది విద్యార్థులు ఎంపిక

శ్రీ సాయి నవోదయ కోచింగ్ సెంటర్ సాధించిన ఘనత.
మార్కాపురం :మార్కాపురం పట్నంలోని దేశవ్యాప్తంగా జరిగిన జవహర్ నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్షలో మార్కాపురం పట్టణంలోని శ్రీ సాయి నవోదయ కోచింగ్ సెంటర్ నుండి 9 మంది విద్యార్థులు ఎంపికైనట్లు నిర్వాహకులు పి.లక్ష్మీదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా ఆదివారం వెలువడిన ఫలితాలలో తమ కోచింగ్ సెంటర్ నుండి చదివిన విద్యార్థులు 9 మంది సీట్లు పొందడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ ఏడాది జనవరి 20వ తేదీన రాసిన పరీక్ష ఫలితాలు నేడు విడుదల అయ్యాయని అన్నారు. కలుజువ్వలపాడు నవోదయ విద్యాలయం -2 నందు పశ్చిమ ప్రకాశం జిల్లాలోని 27 మండలాల నుండి 80 సీట్లు కేటాయిస్తారని అందులో 9 సీట్లు తమ కోచింగ్ సెంటర్ నుండి విద్యార్థులు అర్హత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది శ్రీ సాయి నవోదయ కోచింగ్ సెంటర్ నుండి అత్యధికంగా విద్యార్థులు నవోదయ విద్యాలయం సీట్లలో అధిక భాగం అర్హత సాధిస్తుంటారని లక్ష్మీదేవి తెలిపారు. ఈ కృషికి తమ కోచింగ్ సెంటర్’లో పనిచేస్తున్న అధ్యాపకులకు, సీట్లు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అర్హత సాధించిన మా విద్యార్థుల పేర్లు, హాల్ టికెట్ నెంబర్ వరుసగా.

  1. పి.రేవంత్ కుమార్ ( హాల్ టికెట్ నెంబర్ -1104619 )
  2. ఆర్.వి.ఎస్. యువతేజ ( హాల్ టికెట్ నెంబర్ – 1105206 )
  3. ఎం.భావేశ్ ( హాల్ టికెట్ నెంబర్ – 1104565 )
  4. జి.జాయిస్ మెర్లిన్ ( హాల్ టికెట్ నెంబర్ – 1104523 )
  5. జి.నాగ సాహిత్య ( హాల్ టికెట్ నెంబర్ – 110 7150 )
  6. ఎం.భరత్ ( హాల్ టికెట్ నెంబర్ – 1100620 )
  7. టి.సూర్య ప్రకాష్ (హాల్ టికెట్ నెంబర్ – 1106815 )
  8. జి.సాత్విక్* (హాల్ టికెట్ నెంబర్ – 111620 )
  9. జి.యోహాన్ మయూర్* ( హాల్ టికెట్ నెంబర్ – 1108058 )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article