Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుజనం కోసం జనసేన మహాయజ్ఞం

జనం కోసం జనసేన మహాయజ్ఞం

794 వ రోజు ఇంటికి దూరంగా ప్రజలకు దగ్గరగా

గండేపల్లి .

గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో జనం కోసం జనసేన మహా యజ్ఞం 749 వ రోజు ఇంటికి దూరంగా ప్రజలకు దగ్గరగా ఇంటింటికీ తిరుగుతూ ఉన్న క్రమంలో గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ప్రజలను సూర్యచంద్ర కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా బలమైన ఆయుధం అని రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు అంతా ఆలోచించి నిర్ణయం తీసుకుని తమకు అన్నివిధాలుగా ఉపయోగపడి వారి సమస్యలను తీర్చే నాయకుడిని మీ బలమైన ఓటు ద్వారా ఎన్నుకోవాలని అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగుతుందని సూచించారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధి హామీ పథకంలో భాగంగా సంవత్సరానికి 100 రోజుల పని హామీని 200 రోజులకు పెంచే విధంగా, అంతేకాకుండా ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వంలో ఇంటి దగ్గర కూర్చున్న పెద్ద పెద్ద నాయకులకు కూడా దొంగ మస్తర్లు వేయించడం వలన కష్టపడి పనిచేసే వారికి కనీస వేతనం చాలా తక్కువగా వస్తుంది కాబట్టి జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఎక్కడా కూడా దొంగ మస్తర్లు లేకుండా చేసి కష్టపడి పని చేసే వారికి కనీస వేతనం 400 రూపాయలు వరకు వచ్చే విధంగా అసెంబ్లీలో ప్రజలందరి తరపున వారి గళం వినిపించి పేదలందరికీ న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో పారిశుధ్య వ్యవస్థను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ద్వారా మెరుగు పరచడంతో గ్రామంలో ప్రతి చోట దోమల నివారణ జరిగి ఎటువంటి రోగాలు ప్రబలకుండా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేలా చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article