Thursday, May 1, 2025

Creating liberating content

టాప్ న్యూస్చీ….ఛీ….వీరు అధికారులేనా..?

చీ….ఛీ….వీరు అధికారులేనా..?

*మంత్రి మనోహరా ఈ మాయగాళ్ల మాటేమిటీ..
*ఇందులో జనసేన నాయకుడున్నాడట..
*బియ్యం కెటుగాళ్లకు కూడా పార్టీ సపోర్ట్ ఇస్తుందా…
*గన్నీ బ్యాగులతోనే గ్యాంబ్లింగ్ చేస్తున్నారే…
*నిత్యం రద్దీ గా ఉండే నగరంలోనే ఇలా ఉంటుంటే…
*నరేంద్రుడి నయా మోసం నేడే తెలిసిందా…
*నాటి 700 బస్తాలు మాటేమిటి…
*డీలర్లను వదిలారు.. ఎండియు లను కొట్టారు…
*సీజ్ చేస్తే తాళాలు పగలగిట్టి బియ్యం ఎత్తు కెళ్లినా…
*సింగ్ నగర్ కేసు పెట్టినా తీరు మారక పోయే…
*విజిలెన్స్ సీఐ ఉమర్ కే సిఫార్సు చేసిందెవరు…
*బియ్యం దొంగల వెనుక ఉన్న గజ దొంగ ఎవరూ…
*ఈ దొంగలు ..ఆ దొంగల దోబూచులాటకు దండన లేదా..?
*ఈ బియ్యం దొంగల ముఠా మామూళ్ల మత్తులో ఉన్నారా..
*డిఎస్ ఓ ,ఏ ఎస్ ఓ లు దండుగా ఉన్నట్లేగా..!
*డీటీ, ఆర్ ఐ లే వీరికి అండనా. !
*ఈ నీతి లేని అధికారులు నిజాలు తెలుసుకునేదెన్నడో
*ఈ మాయగాళ్లను మూసివేసేదెన్నడో..?
(రామమోహన్ రెడ్డి)
“నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని
మారదు లోకం మారదు కాలం
గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి
గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి
యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్ఠం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా
వేట అదే వేటు అదే నాటి కధే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండ
నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని
మారదు లోకం మారదు కాలం”అని సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆనాడు ఎందుకు అలా అన్నాడో ఈ నాటి వ్యవస్థ తీరు చూస్తే నిజమే కదా అన్న మీమాంసకు రావాల్సి వస్తుంది.
ఎందుకంటే రాజకీయ నాయకుల స్వార్థం అధికారుల దనదాహం అవినీతి పరుల అరాచకం నీతి లేని వ్యవస్థల వల్ల పేదవాడు కాసింత అన్నము కూడా కాళీ కడుపులో నింపుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఇంకా ఉండిపోవడం సగటు మనిషి చేసుకున్న పాపం గా అభివర్ణించాలి.ఒక నాడు ఆంద్ర రాష్ట్ర ప్రజలు అన్నామో రామచంద్ర అని విలపించటం చూసి అన్న నందమూరి తారకరామారావు కిలో రెండు రూపాయల రేషన్ బియ్యాన్ని ఇచ్చి కొట్లాది మంది పేద ప్రజల కడుపు నింపి ఆ కుటుంబాలలో ఆకలి చావులు లేకుండా చేశారు. అలాంటి మహత్తరమైన పథకాన్ని ప్రభుత్వాలు మారినా…ముఖ్యమంత్రులు మారినా పేదవాడి బియ్యాన్ని మాత్రం ఆపకుండా ఇస్తున్నారు. అయితే ఇలా ఇస్తున్న బియ్యాన్ని కొంతమంది రేషన్ దొంగలు తమ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం అమాయక ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి మూటలకు మూటలు మాయం చేసి నీతి లేని అధికారులను మామూళ్ల మత్తులోకి దించి పరాయి రాష్ట్రాలకు అమ్ముకుని కోట్ల రూపాయలు కూడబెట్టుకుని జీవిస్తున్నారు.
గతంలో పట్టుబడిన వేరే సంచుల్లోకి మార్చేసి రహస్యం గా అక్రమ రవాణాచేసే వారు.కానీ గత ప్రభుత్వ పాలనా వైఫల్యం కారణంగా అక్రమాలు, దోపిడీ,దౌర్జన్యాలు బరితెగింపు అనేవి ఎలా చేయాలో బాగా వంట పట్టించుకున్న ఈ బియ్యం కేటుగాళ్లు బలుపు మాటలు,బజారు రౌడీలు గా ప్రవర్తన కలిగి బహిరంగంగా ప్రభుత్వం సరఫరా చేసే గన్నీ బ్యాగులతో సహా కొరియర్ వ్యానులు ఇతర అందమైన వాహనాలతో గొడౌన్ లకు తరలించి అక్కడ నుండి ఐచర్, పది, పద్నాలుగు టైర్ల లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్మ చేసుకుంటున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలల దాటినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు పేదల పక్షపాతిగా ఉన్నా,తన కొడుకు కు ప్రమాదం జరిగిన బరువెక్కిన గుండెలో ఇచ్చిన మాట పేద ప్రజలే ముందు అని గిరిజన ప్రజలతో ముచ్చటించి ఆతరువాత తన కుమారుడిని కోసం బయలు దేరి వెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పేరు చెప్పి జనాల నోటికాడి కూడు దోచుకుంటున్న ఈ బియ్యం దొంగలకు భయం కల్పించలేక పోతున్నారనే విమర్శలు వచ్చిపడుతున్నాయి. గత రెండు మూడు రోజులు గా పట్టుబడిన వారు బియ్యం డాన్ లంటూ సోషియల్ మీడియా లో వైరల్ అవుతుంటే ఇది మన ప్రజాస్వామ్య మేనా లేక పాకిస్తాన్ లో ఉన్నామా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం లో అడ్డగోలుగా దోచుకున్న రేషన్ డాన్ నరేంద్ర, కృష్ణ లంక సుబ్బారావు లు కూటమి ప్రభుత్వం లో కూడా అదే పంథా నడి పిస్తున్నారంటే జిల్లా స్థాయి సీవీల్ సప్లై అధికారులకు వారికి అనుబందంగా ఉన్న కింది స్థాయి అధికారుల కళ్ళకు ఏ పొరలు అడ్డుపడ్డాయని అనుకోవాలో అర్థం కావడం లేదు. ఇదే విజిలెన్స్ సీఐ ఉమర్ గతంలో నరేంద్రుడు గొడౌన్ ను సుబ్బారావు ద్వారా తెలుసుకుని 700 వందల బస్తాల బియ్యం ఉన్న గోడౌన్ కు తాళాలు వేస్తే ఈ నరేంద్రుడు ఓ రోజు అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి నిల్వ ఉన్న బియ్యాన్ని తరలించబోతుండగా సమాచారం తెలుసుకున్న సీఐ ఉమర్ అక్కడి వెళ్లి ఇద్దరు ఎండియు వాహన దారులన్ని గూబ గుయ్ మనిపించి మరో ఇద్దరి డీలర్లను కొన్ని అజ్ఞాత శక్తుల మేరకు వదిలి ఈ నరేంద్రుడు మీద మరో ఇద్దరు ఎండియు వాహన యజమానుల మీద సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసినట్టుగా పుకార్లు షికార్లు గా వినిపిస్తున్నాయి.
ఈ నరేంద్రుడు వెనుక కొన్ని అరాచక శక్తులు బలమైనవి ఉన్నాయనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. పామర్రు టు బెజవాడ జర్నీ లో సింగ్ నగర్ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని రేషన్ దందా కొనసాగిస్తూ గత బుడమేరు వరదల్లో వరద బియ్యం లో తేడాలు వచ్చి ఇంకొక వ్యాపారిపై ఓ నకిలీ విలేకరి తో కలిపి ఏలూరు కేంద్రంగా నకిలీ పిడిఎఫ్ మార్ఫింగ్ చేసిన ఘనత కూడా ఈ డాన్ నరేంద్ర కే దక్కుతుందని మీడియా వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
ఇక పటమట పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన పిడిఎస్ రైస్ డాన్ ఓ పత్రికా లో పనిచేసి ప్రస్తుతం పని చేస్తున్నాడో లేదో తెలియని వైచిత్రి ఉన్న ఓ ఎస్వీ రంగారావు లాగా ఈయన అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి అండగా ఉంటూ ఈయన అక్రమ బియ్యం పట్టుబడితే ఆయన రంగంలోకి దిగి ముందు బెదిరించటం, ఆ తరువాత బయపెట్టడం ఆ తరువాత బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేసి సుబ్బారావు వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయ లు లాగా అయ్యేలా అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారనే విషయాలు వెళ్లడవుతున్నాయి.
[ ఇంత జరుగుతున్న సీజ్ ద షిప్ అని ద్వారంపూడి ని సైలెంట్ చేసారే తప్ప దారిలో ఉన్న వందలాది బియ్యం మాఫీయా వారిని వీరి దారిలోకి తెచ్చుకుని ఆమ్యామ్యా లు చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాకపోతే రేషన్ బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం ఒక పెద్ద వ్యవస్థ నడుపుతుంటే నడిరేయి లో నేషనల్ హైవే ద్వారా తరలింపు చూస్తుంటే విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ ,సీవిల్ సప్లై, పోలీసు వీరందరికి తెలియకుండా ఇంత జరుగుతుందా అంటే అది అందరికీ తెలిసిన సత్యమే గా అన్నది వినిపిస్తుంది.ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం ఉన్నా ఏమి చేయ లేదన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఇలాంటి దిక్కుమాలిన వ్యవస్థ లో పేద ప్రజలు బ్రతుకుతున్నారంటే అది వారి దౌర్భాగ్యం గా భావించి జీవించక తప్పదు అన్న భావన వ్యక్తం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article