Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుచాయాపురంలో శని త్రయోదశ పూజలు

చాయాపురంలో శని త్రయోదశ పూజలు

ప్రజాభూమి, రామచంద్రపురం
రామచంద్రాపురం మండలం రాయలచెరువుకు సమీపంలోని చాయాపురంలో వెలసి ఉన్న శనీశ్వర ఆలయంలో శని త్రయోదశి పూజలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అర్చకులు ఉంగరాల సుబ్రహ్మణ్యం స్వామి ఛాయాదేవి సమేత శని భగవానునినీ సుప్రభాత సేవతో మేల్కొలిపారు. నిత్య పూజలు చేశారు. త్రయోదశి సందర్భంగా పలువురు భక్తులు తైలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. శని గ్రహ దుష్ప్రభావం నుంచి విముక్తి పొందటానికి భక్తులు నువ్వులను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి , దీపాలు వెలిగించారు చేపట్టారు. నవగ్రహ దోష నివారణ, శాంతి హోమాలు, అఖండ భజన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఆవరణలోని అభయ హస్త ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. శని త్రయోదశి నాడు శనీశ్వర భగవానునికి నువ్వుల తైలాభిషేకం నిర్వహించటంలో ఉన్న ప్రత్యేకతను అర్చకులు ఉంగరాల సుబ్రమణ్య స్వామి భక్తులకు వివరించారు.శని ప్రభావం గురించి పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు సందేహ నివృత్తి చేశారు. వచ్చిన భక్తులకు ఆలయ నిర్వహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article