పులివెందుల
పట్టణంలోని విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం ఆధ్వర్యంలో సబ్ డివిజన్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని బుధవా రం డిఈ శ్రీనివాసులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభిం చారు.ఈ సందర్భంగా డిఈ శ్రీనివాసులు మాట్లాడు తూ ఎండలు ఎక్కువగా ఉండడంతో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యుత్ ఉద్యోగస్తుల సొంత నిధులతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో డిఈఈ గురు మోహన్ రెడ్డి, ఏ ఏ ఓ విజయలక్ష్మి, విద్యుత్ యూనియన్ నాయకు లు, విద్యుత్తు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

