చంద్రబాబు ఓటమి చెందితే టీడీపీ పరిస్థితి ఏమిటీ
ఎన్ఠీఆర్ చంద్రబాబు కు తేడా ఏమిటీ
జగన్ ఎలా ఇంత గొప్పవాడైయ్యాడు..
అమరావతి:కొన్ని గంటల్లో జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి చెందితే నాలుగు దశాబ్దాల పైబడి చరిత్ర కలిగిన తెలుగోడి ఆత్మగౌరవం కోసమే ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కనుమరుగుకానుందా, 75 సంవత్సరాలు వయస్సు పైబడ్డ బాబు నాయకత్వంలోని తెలుగుదేశం మరో ఎన్నిక నాటికీ పూర్వ వైభవం సంతరించుకుంటుందా? అన్న ప్రశ్న
ఇప్పుడు యావత్ ఓటర్ల మదిలో నుండి వినిపిస్తున్నాయి. ఫలితాలు జూన్ 4వతేదీకి వస్తాయి. అయితే ముందే ఈ ప్రశ్నలకు సమాదానాలు చెప్పితే ఊహాజనితం అవుతుంది. కాబట్టి ఫలితాల జోలికి వెళ్లక పోవడమే మంచిదేమో.
కాకపోతే ఇప్పుడు పార్టీ ఎదుర్కొంటున్న గడ్డు కాలం పైన విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఒక ఓటమి సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒక పార్టీకి చరమగీతం పాడుతుంది అని అంటే పొరపాటే అవుతుంది. కానీ వెండి తెరకు లెజెండ్ గా ఆరాధించిన స్వర్గీయ ఎన్టీరామా రావు స్థాపించిన పార్టీ పరిస్థితి ఇప్పుడు గాలి వానలో ఓడ ప్రయాణం లాగా ఉందనే విషయం ఎవరయినా ఒప్పుకోవాల్సిందే!
దీనికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకుడుగా ఎదగడం వల్లనా లేక బాబు శక్తి యుక్తులు ఉడిగిపోయాయా? లేకపోతె ఎన్టీఆర్ పెట్టిన పార్టీ బాబూ చేతుల్లోకి వెళ్ళాక దాని సహజ స్వభావం కోల్పోయి కాలగమనం లో అంతరించే లక్షణాలు వచ్చాయా అన్న కోణంలో కూడా చర్చ నడుస్తోంది. రాజకీయాలలో అటూ ఇటూ గా చంద్రబాబు సర్వీస్ అంత జగన్ వయస్సు ఉంటుంది అనేది నిజం. అయితే జగన్ ఎలా అలా తక్కువ కాలంలో గొప్ప నాయకుడు కాగలిగాడు? గత ఎన్నికలలో జాతీయస్థాయిలో ఒక ఇమేజ్ వున్న బాబు ను ఓడించి జగన్ ఎలా పొలితికల్ కిల్లర్ కాగలిగాడు?
నిజానికి ఓటమి తర్వాత టీడీపీ ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కునే ప్రయత్నం చేసి ఉండాల్సింది. అంతర్గతంగా చర్చించుకునే వాతావరణం అన్నీ పార్టీలలోనూ లేనట్టే బాబు పార్టీలో కూడా కొరవడింది.
సుదీర్ఘ ప్రయాణం లో ఎవరయినా తనను తానూ మార్పు చేసుకోవాలి.మారుతున్న పరిస్థితి లను ను అర్థం చేసుకుని మారిన పరిస్థితులకు అనుగుణంగా తాను కూడా మారాలి. చేసుకోగలిగాలి.
మధ్యతరగతి నేపథ్యం కలిగిన చంద్రబాబు తన చుట్టూ రహస్య కంచుకోటను నిర్మించుకున్నారు. తిరుపతి యస్వీ యూనివర్సిటీ లో చదివే రోజులనుంచి బాబు ఏ ఇద్దరితో కూడా ఒకే సమయం లో మాట్లాడకుండా ఉండడం. ఒకరితో మాట్లాడేది ఇంకొకరికి తెలియకుండా చూడాలి అనుకోవడం వల్ల బాబు క్రమంగా నిజానికి దూరమయ్యారన్నది వినిపిస్తోంది.
పార్టీలో తలెత్తిన
ఆగస్టు సంక్షోభం లో మామ ఎన్టీఆర్ నుంచీ పార్టీ పగ్గాలు తీసుకున్నాక బాబు అభద్రతా భావానికి గురయి పార్టీ కి బలమైన నాయకులను క్రమంగా దూరం చేసుకున్నారు. తర్వాత మోతగాళ్ళు, భజనపరులు చుట్టూ చేరిపోయారన్నది అక్షర సత్యం.
తాత్కాలిక ప్రయోజనాలకోసం శాశ్వత ప్రయోజనాలకు తిలోదకాలియ్యడం, రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టడం లాంటి చర్యలవల్ల చంద్రబాబు విభజన లాంటి కీలక సమయాలలో రాష్ట్రానికి ఒక సరియైన డైరెక్షన్ ఇవ్వలేకపోయారు. ఆంధ్రా కు వ్యతిరేకంగా తెలంగాణాలో భావోద్వేగాలు చెలరేగుతున్న కాలం లో కేసీఆర్ తో చేతులు కలిపి 2009 ఎన్నికల్లో మహాకూటమిని నిర్మించడం అలాంటి చర్యే.
విజనరీగా భావించే బాబు తెలంగాణ లో కేసీఆర్ రాజేసిన విభజన అంశంను సకాలం లో గుర్తించి సరయిన మందు వేయలేకపోయారు.
విభజన అనంతరం కూడా రాష్ట్రానికి ఒక దశ, దిశా ఇవ్వడం లో విఫలం అయ్యారు. ఒకసారి హోదా అనడం,ఇంకోసారి ప్యాకేజి అనడం? మళ్ళీ కాదు కాదు హోదా అనడం,మోడీతో దోస్తీ ఒకసారి, తెగతెంపులు మరోసారి; మళ్ళీ దోస్తీ–ఇలాంటి యూ-టర్న్ లు తీసుకుంటూ స్పష్టమైన డైరేక్షన్ తో వెళ్ళలేక లేకపోయారు.
యన్టీఆర్ వెనక నడిచిన బిసిలు, ముస్లిములు లాంటి సామజిక వర్గాలు బాబుకు దూరం అయ్యాయి. పార్టీ అమరావతికి వచ్చాక బాబుకు కులం చెద పట్టిందన్న భారీ విమర్శలు మూటగట్టుకోక తప్పలేదు.అందుకే గత ఎన్నికల్లో బాబు పైన జగన్ విజయం సాధించారు. మరి ఈసారీ ఏమవుద్దో చూద్దాం.

