చంద్రగిరి:
చంద్రగిరి వారపు సంతలో ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ల దాతృత్వంతో అన్నదానం చేశారు. ఈ క్రమంలో డివిజన్ అధ్యక్షులు కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు సంవత్సరం రోజులుగా ప్రతి వారం సంతలో వ్యాపారులకు, రైతులకు, సంతకు వచ్చు మహిళలకు, పట్టణంలో ప్రజలకు పెద్ద ఎత్తున అన్నదానం చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరిని ఆదుకునే మనస్తత్వంతో చెవిరెడ్డి కుటుంబం చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో చెవిరెడ్డి కుటుంబాన్ని ప్రజలు ఆదరించాలని వారు కోరారు. అధికారంలో ఉన్న లేకపోయినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎల్లప్పుడు ప్రజలతోనే ఉన్నారని, అలాంటి కుటుంబాన్ని ఆదరించడం మనందరి బాధ్యత అని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుని ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో
కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వైకాపా నాయకులు కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి, రూప రామ్మూర్తి,చేగు గోవర్ధన్ గుప్త, పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ , ఎ.రాజశేఖర్ రెడ్డి, విరూపాక్ష శంకర్ రెడ్డి, సిద్ధిక్ భాష, నాగరాజ, సూరి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.