వేంపల్లె :హనుమాన్ జయంతి ని పురస్కరించుకుని వేంపల్లి వృశభాచాలేశ్వర స్వామి భక్త మండలి ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. కవి డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో రామ, లక్ష్మణ, సీత, హనుమంతుని వేషధారణ లు ఎంతగానో ఆకట్టుకున్నాయి, చిన్నారుల చేసిన కోలాటం నృత్యం అలరించింది.ఈ కార్యక్రమంలో భక్తమండలి సభ్యులు వెంకటేష్, సత్యన్న రాంమోహన్, దొంతు వీరయ్య, దేరంగుల రామాంజనేయులు, కవి వరప్రసాద్ రావు , భాజాపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరి ప్రసాద్, భాజపా జిల్లా ఉపాధ్యక్షురాలు పి. సుస్మా, టిడిపి మండల ఉపాధ్యక్షుడు పసులేటి వీరభద్ర , ప్రసాద్ రెడ్డి, పవన్ పెద్ద ఎత్తున హిందూ బంధువులు పాల్గొన్నారు.