ముదిగుబ్బ
ముదిగుబ్బ మండలంలోని బుధనంపల్లి గ్రామంలో మంగళవారం భూదలమ్మ జాతర ఘనంగా జరిగింది. యేటాజరిగే ఈజాతరకు మండల వ్యాప్తంగా ఉన్న భూదలమ్మ భక్తులతో పాటు జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్దఎత్తున హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈజాతరలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తెలుగుదేశం ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తోపాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. బుధనంపల్లి సర్పంచ్ వెంగళరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఆలయంవద్ద అన్నిరకాల సౌకర్యాలు కల్పించగా ముదిగుబ్బ పోలీసులు గట్టిభద్రత ఏర్పాట్లు నిర్వహించారు.

