ఎస్సై జయ బాబు
కామవరపుకోట :ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహింప చేయడం కోసం గ్రామాలలో శాంతియుతం నెలకొల్పడం కోసం సి ఐఎస్ ఎఫ్ జవాన్లతోనూ పెట్రోలింగ్ నిర్వహింప చేస్తున్నట్లు తడికలపూడి ఎస్సై జయబాబు చెప్పారు .కామవరపుకోట మండలంలోని జలపవారి గూడెం, కళ్ళచెరువు ,పాతఊరు, కామవరపుకోట గ్రామాలలో మార్చ్ ఫాస్ట్ సీ ఐ ఎస్ ఎఫ్ జవాన్లతో చేయించినట్లు అని చెప్పారు. పోలింగ్ ను సజావుగా సాగించడం కోసం గ్రామాలలో ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు .ఇప్పటికే గ్రామాలలో ఏ ప్రాంతాలలో అలజడులు జరుగుతాయో ఆయా గ్రామాలలో స్థానికులను అప్రమత్తం చేశామని చెప్పారు. ఏ విషయంలోనైనా మనస్పర్ధలు వచ్చిన గొడవలు వచ్చిన స్థానికులు సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఎన్నికల నియమావళి చాలా కఠినంగా ఉన్నాయని పోలీసులు పైన తీవ్రమైన ఒత్తిడి నెలకొనే పరిస్థితి నెలకొందని అందుకుగాను గ్రామాలలో సిఐఎస్ఎఫ్ ఫోర్సును ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలవేళ రాజకీయ నాయకులు ఆయా పార్టీ కార్యకర్తలు తమ తమ పార్టీలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే తగ సూచనలు చేసేమని చెప్పారు. రాజకీయ నాయకులు కూడా పార్టీ కార్యకర్తలను ఎప్పటికప్పుడు తమ ఆధీనంలో ఉంచుకొని తగులు లేకుండా కొట్లాటలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల నేతలపై ఉందని ఆయన అన్నారు. ప్రధాన పార్టీ నాయకులు ఈ విషయంపై దృష్టి సారించి పోలీసులకు సహకరించాలని కోరారు.
