అప్రైజర్లను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి
- సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
*డిమాండ్లు పార్లమెంటులో వినిపించాలని ఢిల్లీలో పలు పార్టీలతో భేటీ
ముదిగుబ్బ
దేశంలోఉన్న 91 కార్పొరేట్ రంగ బ్యాంకుల్లో ఆదాయానికి ప్రధానఆధారమైన గోల్డ్ అప్రైజర్లకి ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని, అన్నిబ్యాంకుల అప్రైజర్లని పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని, సమానపనికి సమానవేతనం ఇవ్వాలన్న డిమాండ్లతో కేంద్రప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు జాతీయ బీసీ కమిషన్ సంఘము ఆధ్వర్యంలో అప్రైజర్ల సంఘం సభ్యులు శుక్రవారం పలు పార్టీల నేతలతో పాటు రాజ్యసభ సభ్యులతో కలిసి కోరారు. ఇందులో భాగంగా కేంద్ర సోషల్ జస్టిస్ మినిస్టర్ శ్రీరామదాసు, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ కేంద్ర మాజీమంత్రి హంసరాజ్ గంగారం, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు, వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యతో పాటు పలువురు ఎంపీలను, జాతీయ బీసీసంక్షేమ సంఘం అధికారప్రతినిధి, ఏపీ స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు కర్రీవేణుమాధవ్, మజ్దూర్ ఆల్ బ్యాంక్ అప్రైజర్ ఏపీఅధ్యక్షుడు డా.నల్లమాటి కొండలరావు, ఎక్కల భార్గవ, కీర్తిసురేష్ బాబు, సంతరావూరిబ్రహ్మం, చేవూరిరవిసుధాకర్, రమేష్, నాగరాజుల బృందం కలిసి తమ డిమాండ్లను నెరవేర్చేందుకు కృషి చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా స్వర్ణకారుల, అప్రైజర్ల కుటుంబాల వారికి సరైనన్యాయం జరిగేలా కమీషన్ ఎంక్వైరీ చేయాలని కోరుతూ, స్వర్ణకారుల వృత్తిలో ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, కరోనాలు విధి నిర్వహణలో మృతి చెందిన వారిని గుర్తించి ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ కౌశల్ యోజన పథకం కొంతవరకు స్వర్ణకారులకు ఉపయోగపడిందని అదేవిధంగా తమన్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.