కాజులూరు
జాతీయ నులిపురుగులు నివారణ దినోత్సవం పురస్కరించుకుని గొల్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిదిలో నులుపురుగు నివారణమాత్రలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈమేరకు శుక్రవారం పిహెచ్ సి పరిధిలో గల 41 పాఠశాలలు,33 అంగన్వాడీ కేంద్రాలు,రెండు జునియర్ కళాశాలల్లో 0నుండి 19 సంవత్సరాలు వయస్సు గల విద్యార్థినీవిద్యార్థులకు మొత్తం 4,వేల8 వందల 39,మంది పిల్లలకు గాను 3వేల 9వందల14 మంది పిల్లలకు (80%) ఆల్బండోజోలు మాత్రలు వేయడం జరిగిందని పిహెచ్ సి వైధ్యాదికారిణి యన్. సౌజన్య తెలియజేసారు. ఈసందర్భంగా వైద్యాధికారిణి సౌజన్య మాట్లాడుతూ ఈమాత్రలు పిల్లు చే మింగించడం ద్వారా పిల్లల్లో రక్తహీనత నివారించవచ్చునని తెలిపారు. ఈమాత్రలు మింగని మిగిలిన పిల్లలకు ఈనెల 16 వ తేదీవరకూ అందజేయనన్నట్లు సౌజన్య తెలిపారు.ఈకార్యక్రమంలో గొల్లపాలెం పిహెచ్ సి డాక్టర్స్ ఎన్.సౌజన్య, సి.హెచ్ .వి.ఎల్ .శ్రేయ,నరాల రాజారావు,పిహెచ్ సి సిబ్బంది, ఆయా పాఠశాలల ఉపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.