రావికంపాడు ప్రచారంలో యనమల దివ్య
తుని :మీ ఇంటికి మీ దివ్య రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా ఇవాళ రావికంపాడులో
యువనేత్రి యనమల దివ్య పర్యటించారు. మండల టిడిపి అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన జరిగిన మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమాన్నికి విచ్చేసిన యనమల దివ్యకు టీడీపీ జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు.తొలుత పార్టీలో చేరికలు
జరిగాయి.స్వర్గీయ మెర్ల సత్యనారాయణ చౌదరి తనయుడు
రవీంద్రనాథ్ చౌదరి ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బాబు ష్యూరిటి… భవిష్యత్తుగ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. టిడిపి జనసేన కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లిన యనమల దివ్య కు మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో యనమల నాగేశ్వరరావు యనమల కృష్ణ, యనమల రాజేష్, మోతుకూరి వెంకటేష్, చింతంనీడి అబ్బాయి, కుచ్చర్లపాటి అరవింద వర్మ,శిద్దా శ్రీరామచంద్రమూర్తి, వెల్నాటి పాపయ్య రాజు, పేరూరి బాబురావు, పోసిన నందిబాబు,ఆరం బాబ్జి, శిద్దా అప్పన్న దొర, వెల్నాటి భరత్, వెల్నాటి మురళి, ఏనుగు బాబులు, తటవర్తి ఖజానా, సిద్ధ చక్రరావు, శిద్దా కోటయ్య, సూరాబత్తుల వీరబాబు, వెల్నాటి చలమయ్య, గోరకపూడి సురేష్, ఇండిగిబిల్లి
వీరయ్య, అరిగల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.