కదిరి:రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిని చేయాలనే సంకల్పంతో ఈనెల 10న శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించే వైసీపీ గిరిజన జన గర్జన మహాసభకు కదిరి నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ప్రతి గిరిజన సోదరుడు హాజరై సభను విజయవంతం చేయాలని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ అహ్మద్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన కార్యాలయంలో జిల్లా గిరిజన నాయకులతో కలిసి మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి గిరిజన సోదరుడు ఈ మహాసభకు హాజరై జగనన్న చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని ప్రతి ఒక్కరికీ వివరించాలని కోరారు. అదేవిధంగా రెండోసారి అధికారం చేపట్టాలంటే రాష్ట్రంలోని ప్రతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేయాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్టీ రాష్ట్ర జోనల్ ఇంచార్జ్ దుంగావత్ రమేష్ నాయక్, రాష్ట్ర అధికార ప్రతినిధి కే.పీ కుళ్లాయప్ప నాయక్, ఎస్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపాల్ నాయక్, నల్లమడ ఎంపీపీ ఆంజనేయులు నాయక్, సర్పంచులు చలపతి నాయక్, రమణ నాయక్, నాయకులు భూక్య కృష్ణ నాయక్, రవి నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద నాయక్, ఉప సర్పంచ్ వసంత నాయక్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.