కడప
శుక్రవారం స్థానిక వాచి మిన్ పవన్ యందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏఐటియుసి జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేసి బాదుల్లా మాట్లాడుతూ,
ఫ్లిప్‌కార్ట్, జొమాటో, ఓలా, ఉబర్,డన్జో, ఫ్రెష్‌ఆన్, జెప్టో,తదితర గిగ్ వర్కర్ల కొరకు సామాజిక భద్రత చట్టం తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు తీసుకొచ్చిన విధంగా చట్టం తీసుకువచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మరియు ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈ ఎస్ ఐ) , ప్రావిడెంట్ ఫండ్ (పి ఎఫ్) వంటి ప్రయోజనాలు లేవున్నారు.
తక్కువ డబ్బుతో ఎక్కువ పని చేస్తారని , వీరి పని గంటలు స్థిరంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
గిగ్ వర్కర్లు ఎక్కువగా పనిచేసే ప్రదేశాలు బహుళజాతి, కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయని వీరికి సురక్షితమైన ఉద్యోగాలు లేకపోవడం దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ప్లాట్‌ఫారమ్ కార్మికుల సైన్యాన్ని ఉత్పత్తి చేస్తోందన్నారు.
2020-21లో 77 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారని, 2029-2030 నాటికి ఇది 2.34 కోట్లకు చేరుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసినట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల యాక్సిడెంట్ పాలసీ సదుపాయం కల్పిస్తూ జీవో జారీ చేసిందని సుమారు మూడున్నర లక్షల మంది గిగ్ వర్కర్లుకు లబ్ధి చేకూరుందని తెలిపారు.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి లింగన్న, నగర అధ్యక్షులు పి. సుబ్బరాయుడు పాల్గొన్నారు.