మార్పు కోసం నింగినంటిన నినాదాలు, మంచి కోసం జత కట్టిన జెండాలు..

— టవర్ క్లాక్ నుంచి వేల మందితో శాంతియుత ర్యాలీ
చంద్రగిరి:చంద్రగిరిలో గంజాయి, రౌడీయిజం, దౌర్జన్యాల పై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గళమెత్తారు. యువత, ఆడబిడ్డల భవిష్యత్తు కోసం జెండాలు జతకట్టాయి. మార్పు కోసం నినాదాలు నింగినంటాయి. పులివర్తి నాని ఆధ్వర్యంలో టవర్ క్లాక్ నుంచి నూర్ జంక్షన్ వరకు టీడీపీ, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. గంజాయి భూతాన్ని తరిమేద్దాం.. చంద్రగిరి అభివృద్ధికి దోహదపడుదాం, రౌడీ రాజ్యం నశించాలి, శాంతిభద్రతలు పరిరక్షించాలంటూ నినాదాలు హోరెత్తాయి. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ ముందెన్నడూ లేనివిధంగా డ్రగ్స్ మాఫియాతో యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రాణాంతమైన డ్రగ్స్ గంజాయి, బంగాకు, సారా వంటి మత్తుకు యువకులు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తుకు బానిసైన యువత, విద్యార్థులు బాలికల కళాశాల, ఉన్నత పాఠశాలల వద్ద బైకులపై చక్కర్లు కొడుతూ విద్యార్థులను ఈవ్ టీజింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.చంద్రగిరలో రౌడీయిజం నశించాలి…చంద్రగిరి నియోజకవర్గాన్ని రౌడీ రాజ్యం నుంచి కాపాడాలని, శాంతిభద్రతలు పరిరక్షించాలని పులివర్తి నాని కోరారు. ప్రశ్నిస్తే దాడులు, గొంతెత్తితే అణిచివేతలు, మాట వినకుంటే అక్రమ కేసులతో అధికార పార్టీ అరాచకాలు సాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివర్తి నాని, దేవర మనోహర్, మేడసాని పురుషోత్తమ నాయుడు, పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు, గౌస్ బాషా,రమేష్ రెడ్డి, సురేష్ రెడ్డి, ఏ.వి. రమణమూర్తి, కుమార్ రాజారెడ్డి, ఈశ్వర్ రెడ్డి,ధనంజయ రెడ్డి, ప్రవీణ్ రాయల్, సీఆర్ రాజన్, పద్మజా రెడ్డి,బాబు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.