డాక్టర్ డాక్టర్ బి గాయత్రి
జీలుగుమిల్లి:క్షయ వ్యాధి నివారణ కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు డాక్టర్ బి గాయత్రీ దేవి చెప్పారు.ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోసత్సవం మార్చి -24 పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జీలుగుమిల్లి పరిధిలో వివిధ వర్గాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిచడం జరిగిందని ఆమె చెప్పారు.స్కూల్ విద్యార్థులకు మరియు స్వయం సహాయక సంగాలకు క్షయ వ్యాధి పై అవగాహన కార్యక్రమాలు నిర్వహింపజేసినట్లు తెలిపారు.చివరి రోజు సిబంధితో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు .క్షయ వ్యాధి ప్రాధమిక దశలో గుర్తించి సంపూర్ణ చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చును అని అన్నారు.రెండు వారాలు మించి దగ్గు ఉంటే అది క్షయ వ్యాధిగా అనుమానించి కళ్ళే (తేమడ) పరీక్షయ ద్వారా నిర్దారీచుకోవాలి ఆమె సూచించారు.నిర్ధారించిన కేసులకు స్థానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా బహుళ ఔషద చికిత్స అందించడం జరుగుతున్న ఆమె అన్నారు ఆమె అన్నారు.
అత్యాధునిక పరీక్ష అయిన ఆర్టి సిఆర్ స్థానిక పీహెచ్సీ లో అందుబాటులో ఉన్నాయి అన్నారు.పరీక్షలు , సమూల చికిత్స పూర్తిగా ఉచితంగా లభిస్తుంద అని తెలిపారు.
ప్రజలు పై విషయములో అప్రమత్తంగా ఉండాలని అనుమానితులు సత్వరo తేమడ పరీక్షలు చేయించుకొని చికిత్స పొందవలెనని ఆమె కోరారు.
ఈ. కార్యక్రమంలో వైద్యాధి కారిణి డా బి.గాయత్రి , టీబీ పర్యవేక్షకులు
రవి రాజు , మహేష్, లాబ్ టెక్నిషల్ మంగ , సిహెచ్ఓ శ్రీనివాస రాజు, నాగేశ్వరావు ఫార్మసీస్ట్, ఏఎన్ఎం లు , ఆశా వర్కర్లు ఎం ఎల్ హెచ్ పి లు తదితరులు పాల్గొన్నారు.
