Sunday, May 18, 2025

Creating liberating content

టాప్ న్యూస్కౌతాగోడలు పదిలమేనా..?

కౌతాగోడలు పదిలమేనా..?

*వంద సంవత్సరాలు అయినా శిథిలావస్థకు రాలేదా…!
*పట్టణ ప్రణాళిక శాఖ పూర్తిగా పరిశీలన చేసిందా…
*ఇంకెన్ని సంవత్సరాలైన ఉండొచ్చని నిర్దారించారా…
*ఆ నిర్మాణం గట్టిదయితే పర్వాలేదు…
*ఓట్టిదయితే పోయే ప్రాణాలెన్నో…
*వందలాది మంది వస్తుంటారు..పోతుంటారు…
*ప్రమాదం జరిగితే వచ్చే పోయేవారికి ప్రమాదం వస్తే…
*పాటల మాటున ఎన్నో పొరపాట్లు జరిగాయి…
*సిగపట్లకు నిలయంగా ఇప్పటికే పేరుంది…
*ఇంకా బైటికి రానివి ఎన్నో మరెన్నో ఉన్నాయి…
*ఆ కౌతా లో మాజీ తాజా ప్రభుత్వ అధికారులూ ఉన్నారు…
*ప్రభుత్వాలు పురాతన భవనాల్లో ఉండద్దని అంటున్నారు…
*వాతావరణం మార్పు ..అకాల వర్షాలుకు అప్రమత్తం అంటున్నా…
*శతాబ్దం దాటుతున్న ఈ సత్రం నిర్మాణలలో నివాసం నిశ్సలమేనా…
*నాటే జేసీ పరిశీలన రిపోర్ట్ అంతా లోపభూయిష్ట మేనా…
*మున్సిపల్ అధికారుల పరిశీలన చేసిందెప్పుడు..నిర్దారించిదేమిటీ…
*అంతా బాగుంటే ఓకే లేదంటే …?
*కళాకారుల ప్రాణాలతోతో చెలగాటమేల..
*అద్దెల కోసం అన్యాయం చేయడం లేదుగా…
*ధర్మసత్రంలో అన్నీ ధర్మాంగానే ఉన్నట్లేనా…
*ఓ దేముడా… ఈ ధర్మసత్రంను ఒక దారిలో పెట్టారా…?
(రామమోహన్ రెడ్డి)
వాతావరణ మార్పులు ముందస్తు రుతు పవనాల కారణంగా కురుస్తున్న అకాల వర్షాలతో ఆకస్మిక వరదలు ,పిడుగులు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పాత భవనాల్లో కానీ ,చెట్లు ,శిథిలావస్థకు చేరిన నిర్మాణాల సమీపంలో ఉండకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
కారణం ప్రస్తుత పరిస్థితుల్లో ఏ నిర్మాణం ఎప్పుడు కూలిపోయి ఎంత మంది దుర్మరణం చెందుతున్నారో ఎవరూ కూడా ఊహించని రీతిలో ప్రస్తుత పరిస్థితిలు ఎదురవ్వడం సర్వసాధారణం అయింది.
మారుతున్న పరిస్థితులు దృష్ట్యా వందల సంవత్సరాల నిర్మాణాలు పదిలంగా ఉన్నా పది సంవత్సరాల నిర్మాణాలు కూడా కుప్పకూలి పోతున్నాయి. అది కాలవైపరిత్యమా లేక కలికాలమా ,పొగాలమా అన్నది అర్థం కానీ స్థితిలో ప్రస్తుతం ప్రజలు జీవనం సాగిస్తున్నారు.ఇది అక్షర సత్యం గా నిలుస్తున్నాయి.
అయితే శతాబ్దం దాటిన కౌతా గోడలు పదిలంగా ఉన్నాయా..పడిపోతాయా అన్నది నిర్దారించింది ఎవరూ అన్నది ఇప్పుడు ప్రశ్నర్థకంగా మారింది.

దీనిపై పూర్తి వివరాలు వచ్చే సంచికలో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article