Thursday, January 15, 2026

Creating liberating content

టాప్ న్యూస్కోడి రక్తాన్ని చల్లితే కేసుల్లో పెట్టారు…!

కోడి రక్తాన్ని చల్లితే కేసుల్లో పెట్టారు…!

*కోడికే కత్తులు కట్టి పొట్లాటకే దింపితే…
*బరికి లక్షల్లో పెట్టి బెట్టింగులు సిద్ధమువుతుంటే…
*జంతుబలి చట్టం అమలు జరిగి తీరుతుందా…
*హైకోర్టు ఆదేశాల ఆమలుకు అందరూ సహకరిస్తారా…
*ప్రజాప్రతినిధులే పరదాల చాటున పందేలు చూస్తుంటే…
*శాసనాలు చేసే వారే చెలగాటం అడుతుంటుంటే…
*ఇక జుల్లా అధికారులు ఈ జల్సాలు ఆపుతార…
*పోలీసులకు తెలియకుండానే కోడి పందేలా నిర్వహణ జరుగుతుందా…
*గోదావరి జిల్లాలలో జరిగే తంతు ఆపేదెవరు..
*కోడికి కత్తి …కాసుల కక్కుర్తి కట్టడి చేసే దమ్ముందా…
*కోట్ల రూపాయల పందేరా లకు కళ్లెం వేసేవారున్నారా…

  • పేరుకు సాంప్రదాయం… జరిగేది చావు బ్రతుకుల ఆటలా..?
  • కోడి పందాలపై కొరడా ఝులిపిస్తారా…!
    (రామమోహన రెడ్డి)
    ఆచారాలు, సంప్రదాయాలు అంటే ఒక సమూహం లేదా సమాజం తరతరాలుగా పాటిస్తున్న జీవన విధానాలు, నమ్మకాలు, కర్మకాండలు, వేడుకలు, అలవాట్లు, ఇవి సంస్కృతిలో భాగం, తరచూ ఆధ్యాత్మికత, పూర్వీకుల వారసత్వంతో ముడిపడి ఉంటాయి, సామాజిక బంధాలను పెంచుతాయి. ఇవి ఒక ప్రాంతానికి, తెగకు, మతానికి ప్రత్యేకమైనవిగా ఉంటాయి, జీవితంలో క్రమశిక్షణ, అర్థాన్ని, ఐక్యతను తెస్తాయి. ఆచారంలో అపచారం అంటే, సంప్రదాయాలు, మర్యాదలు, లేదా పవిత్రమైన పద్ధతులు పాటించాల్సిన చోట వాటికి విరుద్ధంగా, అగౌరవంగా, లేదా తప్పుగా వ్యవహరించడం; ముఖ్యంగా దేవాలయాలు, పూజలు, దీక్షలు వంటి పవిత్ర స్థలాల్లో లేదా సందర్భాల్లో జరిగే తప్పులు, అక్రమాలు, అసభ్యకరమైన చేష్టలను సూచిస్తుంది. దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, పవిత్రతకు భంగం కలుగుతుంది.
    ఇక్కడ ప్రదానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే అనాదిగా సాగుతూ వస్తున్న ఆచార వ్యవహారాలు ఎన్నో రకాల సమస్యలకు కారణమవుతున్నాయి సంప్రదాయం పేరుతో ఆడే ఏ జూదం కూడా అది ఎన్నో సంసారాలను రోడ్డున పడేస్తాయని చెప్పనక్కర్లేదు. ఒక నాడు సామంతులు,కోటేశ్వరులు,బాగా బలిసిన కుటుంబాల వారు తమ ఆనందం కోసం ఆడే వినోదమైన జూదం నేడు సామాన్య ప్రజల వరకు చేరి అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వడం లేదా అంటే అందుకు సమాధానం దొరకని పరిస్థితి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి జిల్లాలలో సంక్రాంతి పండుగకు ప్రతి చోట ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద పెద్ద పరదాలు, పెద్ద ఎల్ ఈడీలు ఏర్పాటు చేసి పదునైన కత్తులు కోడి పుంజులకు కట్టి బరిలో దింపి పైసల పందేరం లో మునిగి పోతుంటారు. ఇలాంటి పందేరం లో పాల్గొని పైసలు పోగొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు లేక పోలేదు. ప్రతి ఏడాది పండుగ రావడం పండుగ ముందు ప్రకటనలు చేయడం పోలీసులు ఉత్తుత్తి ప్రసంగాలు ,పికెటింగ్ ఇవన్నీ కూడా పత్రికా కథనాలకు అందంగా ఉంటాయే తప్ప అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయకుండా అపగలిగేది కూడా అత్యున్నత స్థాయిలో ఉన్న అధికార యంత్రాంగం, ఆ యంత్రాంగాన్ని నడిపించే పెద్దలన్న మాట అటు అందరికీ తెలిసిన విషయం అయినా కూడా ఈ హడావుడి మాత్రం తప్పదు.

జల్లికట్టు, కోడిపందేలవంటివి కోర్టులు ప్రభుత్వాలు నిబంధనలు విధించినా ఆపగలిగేరా. తరతరాలుగా ప్రజల్లో పాదుకుపోయిన వేడుకలను, ఆచారాలను, జాతరలను రూల్స్, నిబంధనల లాంటివి మార్చలేవు అని ఋజువైపోయినట్లే. ఆ మాటకొస్తే కఠిన నిబంధనలు ఉన్నా అవినీతి, జూదం, పేకాట వంటివి మాయం అయ్యేయా లేదుగదా. చెడ్దవే పోనప్పుడు ప్రజలు పవిత్రంగ ఆచారాలుగా సెంటిమెంట్లుగా పాటిస్తున్నవి ఎందుకు వదులుకుంటారు.
కానీ కొన్ని ఉత్సవాలు, పూజలలాగే మరికొన్ని జాతరలు అందులో జంతుబలులు కొంతమంది ప్రజల సామాజిక ఆచారంగా కొన్ని ఒక పిరియాడికల్ పూజా ఆచారాలుగా కూడా మారిపోయాయి. వారిలో వ్యక్తిగతమైన పెద్ద సెంటిమెంట్లుగా మారిపోయాయి. ఇప్పుడు చూడండి ఒక స్థితిమంతుడైన పెద్దమనిషి వినాయకచవితి రోజున తన వీధిలో మంచి స్టేజి, పెద్ద సైజులో విగ్రహంతో మైకు, హంగామాతో ఘనంగా గణేశ నవరాత్రులు జరిపిస్తాడు. ఆయనకు ఏరియాలో విశేష గుర్తింపు వస్తుంది. సపోజ్ ఆ ఏడు ఆయనకు వ్యాపారంలోనో, కుటుంబరీత్యానో ఎప్పటినుండో పెండింగు ఉన్నవి ఒక్కసారి కలిసివచ్చాయనుకోండి ఇంక ఆయనకు, ఆ కుటుంబానికి అది ఒక సెంటిమెంటుగా మారిపోతుంది. తోటివారితో కమిటీ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం నిర్వహించడం ఒక ఆనవాయితీగా మారిపోతుంది. అలాగే లడ్డు వేలంలో ఎంత ఖరీదుకయినా పాడటం వంటివి వింటున్నాం గదా.
సరిగ్గా అదే సెంటిమెంట్లు మరి జాతరలు, జంతుబలి వంటి విషయాల్లో కూడా ఎన్నో కుటుంబాలలో తరతరాలుగా కొనసాగుతున్నవి ఉంటాయి. అందుచేత మతాచారాలు, సెంటిమెంట్ల విషయాల్లో ప్రభుత్వ నిబంధనలు, అధికారదర్పాలు పనిచెయ్యవు. పైగా ప్రాంతీయ రాజకీయనాయకులుకూడా ఒక చెయ్యి వేసి ఆ జాతరల్లో ఉత్సవాల్లో వాళ్ల బ్యానర్లు ఏర్పాటుచేయించుకుని వారుకూడా పాల్గొని పూజలు అవీచేసి జనంలో తమ గుర్తింపును ప్రాచుర్యాన్నీ పెంచుకోవాలని పడే తాపత్రయాన్ని చూస్తున్నాం. ఇంక ప్రభుత్వం, పోలీసులు మౌనం వహించడంలో విచిత్రం ఏముంది.అలా కాకపోతే భీమవరం డిఎస్పీ పేకాట శిబిరాలపై తగిన చర్యలు తీసుకోలేదని ఒక వర్గం..అక్కడ అన్యాయం జరుగుతుందని సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు ల మధ్యలో డీఎస్పీ జయసూర్య బలి అయ్యారని చెప్పక తప్పదు. ఉప సభాపతి పేకాట సంప్రదాయం అంటే ఉపముఖ్యమంత్రి అది చట్టవ్యతిరేకమైన చర్యని డీఎస్పీ పై విచారణ జరిపించాలని అదేశాలు ఇవ్వడం చివరికి కూటమి లోని ఉప నేతల మధ్య ఒక ఉద్యోగి నలిగి పోయారు. మరి అదే సంప్రదాయం ముసుగులో జరిగే ఈ కోడి పందేములపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టనుందో వేచిచూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article