ఏలేశ్వరం:-
పట్టణంలో వైకాపా చోటామోటా నాయకులు నుండి బడా నాయకులు వరకు తెలుగుదేశం పార్టీ లోనికి వలసలు వెళ్లే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా శుక్రవారం మాజీ కౌన్సిలర్ బూర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో గేదెలు సురేష్, మువ్వల గంగ, గంపా దుర్గా ప్రసాద్, కాకాడ లోవరాజు, బుసిడి కోటయ్య, చెరుకూరి శ్రీను, మీసాల రాఘవ, గేదెల సాయి, వెన్నె శివ, బూర్ల రమణ, కొసనం రమణ తదితరులను ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వరుపుల సత్యప్రభ వీరందరికీ టీడీపీ కండువా వేసి పార్టీలను ఆహ్వానించారు.పెద శంకర్లపూడి టిడిపి కార్యాలయం లో జరిగిన సమావేశంలో సత్య ప్రభ రాజా మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరికి ఘన స్వాగతం పలుకుతున్నాము అన్నారు.ప్రతీ ఒక్కరూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.