వి.ఆర్.పురం
మండలంలోని రేఖపల్లి గ్రామం నుండి విఆర్ పురం గ్రామం వరకు ప్రతి షాప్ కు, ఇంటింటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై, మండల సీపీఎం బృందం బుధవారం కరపత్రాలు పంచుతూ ప్రభుత్వాలుచేసిన పనులను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనేమ్. సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం. చిన్నబాబు మాట్లాడుతూ అసమానతలు లేని అభివృద్ధి కోసం దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కలవరపరుస్తున్నాయని, ప్రజలందరూ ఐక్యంగా ఆలోచించవలసిన కాలం వచ్చింది, ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్లు పూర్తి కావస్తుంది ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, కడప ఉక్కు ఫ్యాక్టరీ లాంటి విభజన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు, రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిన బిజెపి అంతటితో ఆగకుండా, రాష్ట్ర పారిశ్రామక అభివృద్ధికి గుండెకాయ లాంటిది విశాఖ ఉక్కును తెగ అమ్మమ్మడానికి తయారైందని, కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్ను తెచ్చిందని, విద్య వైద్యం ప్రైవేటుకరించడం వల్ల సామాన్య మధ్య తరగతి ప్రజానీకానికి భారంగా మారాయని, ప్రభుత్వ రంగాన్ని ప్రజల ఆస్తులని ఆదాని అంబానీ దోచిపెడుతుందని అన్నారు. విద్యుత్ మీటర్ పేర్లతో మోటర్లకు మీటర్లు పేర్లతో అనేక భారాలు మోపుతుంది, ప్రభుత్వ విద్యా విధానంతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మించాలని పూర్తి చేయడం చేతకాక వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు జపం చేస్తుంది, అంగన్వాడిలకు, ఆశాలకు, వెలుగు యానిమేటర్స్ , మధ్యాహ్నం కార్మికులు కాంట్రాక్ట్, ఔట్స్ సోర్సింగ్ ఉద్యోగులకు చేసిన వాగ్దానాన్ని గాలికి ఎగిరిపోయాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను రాష్ట్రాన్ని పూర్తిగా గాలికి వదిలేస్తాయి, ప్రమాదంలో పడిన మన రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాలని సామాన్య ప్రజలకు నిజమైన ఊరట లభించాలని ప్రజలే ఐక్యంగా కదలాలి, అప్పుడే మన హక్కులను కాపాడుకోగలం గతంలో చేసిన ఉద్యమాల ఫలితంగా అనేక ఫలితాలు తెచ్చాం, మొన్న సిఐటియూ ఆధ్వర్యంలో అంగన్వాడీలకు నిరాహారదీక్ష పోరాటం సాధించామని ప్రజలే ఆలోచించాలని, ప్రజలు ముందుకు వస్తే ఏమైనా సాధించవచ్చు అని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కారం లక్ష్మి . రమేష్, గుండుపూడి లక్ష్మణరావు, సత్యనారాయణ, కుంజ నాగిరెడ్డి, సుబ్బారావు, పోడియం. పావని, పోడియం గంగరాజు తదితరులు పాల్గొన్నారు.