బిజెపి జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్
జీలుగుమిల్లి
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ సభ సమావేశాన్ని జయప్రదం చేయాలని బిజెపి జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్ కోరారు. తెలుగు రాష్ట్రాలలో విస్తృత పర్యటనలు భాగంగా మంగళవారం నాడు ఏలూరులో ఇండోర్ స్టేడియంలో జరిగే రాజీనాసింగ్ కార్యక్రమానికి పోలవరం నియోజవర్గం నుండి ఏడు మండలాల్లోని బిజెపి పార్టీ కార్యకర్తలు విధిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. జిల్లా నలుమూలనుండి బిజెపి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని బిజెపి సత్తాను నిరూపించాలని ఆయన కోరారు. అందుకుగాను మహిళలు పురుషులు బిజెపి కార్యకర్తలు వారి యొక్క ట్యాగులను తీసుకొని సభా స్థలంలో వారికి కేటాయించిన సీట్లలో ఆసిన్ అవ్వాలని ముందుగానే సంబంధిత కార్యకర్తలకు సూచించాలని ఆయన కోరారు. మధ్యాహ్నం మూడు గంటల 45 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పారు. ప్రతి బూతు లెవెల్ కార్యకర్త తీసుకువెళ్లిన నుండి తీసుకొచ్చేంత వరకు కూడా బాధ్యత వహించాలని ఆయన చెప్పారు. ఏ ఒక్కరికి అసౌకర్యం కలగకుండా చూడవలసిన బాధ్యత ఆయా బూత్ లెవెల్ కార్యదర్శిలకు బాధ్యత అప్పగిస్తున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల దుష్ట బిజెపి సత్తా చాటడానికి జిల్లాకు మంచి అవకాశం వచ్చిందని అన్నారు. రాష్ట్ర కార్యవర్గంలోని ఏలూరు జిల్లాకు పార్లమెంటుకు పోటీ చేయనున్న తపన చౌదరి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నట్లు చెప్పారు.