Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుకాకినాడ జిల్లా లో కరువు ఎదుర్కుంటున్న రైతులను ఆదుకోవాలని

కాకినాడ జిల్లా లో కరువు ఎదుర్కుంటున్న రైతులను ఆదుకోవాలని

జిల్లా కలెక్టర్ కరువు మండలాల్లో పర్యటించాలి

వచ్చే ఎన్నికల్లో రైతులు జగన్ కు బుద్ధి చెపుతారు, సి. పి. ఐ. ధర్నా

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు

ప్రజా భూమి కాకినాడ

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజక వర్గం లో సాగుకు నీరు లేక పుష్కర ఎత్తిపోతల పథకం పైపలైనులు రిపేర్ కావడంతో పంట ఎండిపోయి కరువుతో రైతులు
అల్లాడుపోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు .

శుక్రవారము ఉదయం స్థానిక కలెక్టరోట్ అంబేద్కర్ విగ్రహం వద్ద సుమారు గంటపాటు సీపీఐ నాయకత్వం లో ధర్నా నిర్వించారు .
అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేసారు

అనంతరo ఈ ధర్నాను ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ
జిల్లాలో వర్షాభావంతో తీవ్ర కరువ పరిస్థితిని ఎదుర్కొంటున్న మండలాలన్నింటిని కరువుగా ప్రకటించి యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలిని అన్నారు రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాలలో సుమారు 470 మండలాలలో ఈ సంవత్సరం తక్కువ వర్షపాతం నమోదై తీవ్రర కరువు పరిస్థితులు నెలకొంటున్నట్లు కనిపిస్తున్నాయిని రాష్ట్రంలో ఈనెల 21వ తేదీ వరకు 32.8శాతం తక్కువ వర్షపాతం నమోదైందిని జూన్ నుండి సెప్టెంబర్ వరకు 15.2శాతం కాగా,ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఆధిక ఉష్ణోగ్రతలు వల్ల తక్కువ వర్షపాతం నమోదైందిని మధు అన్నారు. అక్టోబర్ 1 నుండి ఇప్పటి వరకు 74.3శాతం తక్కువగా వర్షం కురిసింది. సుమారు 450 మండలాల్లో
డ్రైస్పల్స్ ఏర్పడ్డాయి.ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన తుంగభద్ర ,శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ,వెలుగోడు, సోమశిల, కండలేరులో గత సంవత్సరం నవంబర్ 22 నాటికి 743.1 0 టిఎంసిలు నీటి నిల్వలు ఉంటే ప్రస్తుతం కేవలం 298. 64 టీఎంసీలు మాత్రమే ఉన్నాయిని వర్షాభావం వల్ల భూగర్భ జలాలు సైతం తగ్గిపోయి. రాయలసీమ జిల్లాలో 2.75 మీటర్లు, కోస్తా ఆంధ్ర జిల్లాల్లో 1.49 మీటర్లు,రాష్ట్రవ్యాప్తంగా 1.88 మీటర్లు సాధారణం కన్నా జలమట్టం తగ్గిందిని మధు పేర్కున్నారు.

దీని ప్రభావంతో ఖరీఫ్ పంటలు సాధారణ విస్తీర్ణం 34.39 లక్షల హెక్టార్లు కాగా, సాగయింది 24.98 లక్షల హెక్టార్లు మాత్రమే. సుమారు 10 లక్షల హెక్టార్లలో సాగు జరగకగా బీళ్ళుగా ఉన్నాయిని రబీ సీజన్ లో సైతం వర్షాభావ పరిస్థితి కొనసాగుతూనే ఉందిని
21 జిల్లాలలో కేవలం 25శాతం భూముల్లో మాత్రమే రైతంగం పంటలు వేశారు.ఈ పరిస్థితులలో మన జిల్లాలో ఖరీఫ్ లో వేసిన ఆహార,ఉద్యాన, వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయిని ఎన్నడూ లేని విధంగా కృష్ణా డెల్టాలో సైతం నీరు అందక పంటలు దెబ్బతిన్నాయిని దీనివల్ల పూర్తి స్థాయిలో దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందిని పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడుతుందిని త్రాగునీటి ఎద్దడి ముంచుకు వస్తోందిని అన్నారు.

రాయలసీమ జిల్లాలో కరువు పరిస్థితులు వల్ల పెద్ద ఎత్తున వలసల ప్రారంభమైనాయిని వర్షాభావం తీవ్రర పరిస్థితుల్లో పంటలు దెబ్బతిన్నాయిని మండలాలన్నింటిని కరువు మండలాలుగా ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుచున్నాముని మధు అన్నారు

వర్షాభావంతో దెబ్బతిన్న ఆహార పంటలకు ఎకరాకు రూ.50 వేలు,వాణిజ్య పంటలకు రూ. 75వేలు, ఉద్యాన పంటలకు ఒక లక్ష రూపాయలు నష్టపరిహారం రైతులకు, కౌలురైతులకు అందించాలిని మధు అన్నారు
ఖరీఫ్ లో తీసుకున్న అన్ని రకాల పంట రుణాలను మాఫీ చేయాలిని
వలసలు అరికట్టేందుకు గ్రామీణ ఉపాధి పనులు పూర్తిస్థాయిలో ప్రారంభించాలి ని
మంచినీటి కొరత ఉన్న గ్రామాల్లో రక్షిత మంచినీరు అందించాలిని మధు అన్నారు.
పశువులకు పశుగ్రాసం,దాణా, ఉచితంగా సరఫరా చేయాలిని
పంటల బీమా, వాతావరణ బీమా పథకాలను వర్తింప చేసి నష్టపోయిన రైతాంగానికి పూర్తి నష్టపరిహారం చెల్లించాలిని గ్రామీణ పేదలందరికీ కరువు పింఛన్లు, ఆరు నెలల పాటు అన్ని రకాల నిత్యవసర వస్తువులు అందించాలని మధు కోరారు
ఈ ధర్నాలో సీపీఐ కార్యదర్శి
కె బోడకొండ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ , పప్పు ఆదినారాయణ , రామారో , సత్య , సుబ్బమ్మ తదితరులు పాల్గున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article