పారుపల్లి నవీన్
ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీకి వైయస్ షర్మిల కాయకల్ప ఉన్ చికిత్స చేయగలరా.. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ హస్తం పార్టీ చేజిక్కించుకోగలదా…. దిశ దశ లేని కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిలా పూర్వవైభం చేసుకుని రాగలరా… ఇప్పుడు ఇవే అంశాలు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా ఉన్నాయి. వైయస్ మరణం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన వంటి సంఘటనలతో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి తల నొప్పి పట్టింది. మరోవైపు వైఎస్ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి దూరమయింది. జగన్మోహన్ రెడ్డి వేరే కుంపటి పెట్టారు. దీంతో కాంగ్రెస్ కేడర్ ఆంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరువయింది. కాంగ్రెస్ పార్టీకి ముందుండి నడిపించే దమ్మున్న నేత కరువయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఉంటే కోల్పోయింది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల హస్తం పెద్దలకు ఆశాకిరణమైయ్యారు. ఒంటి చేత్తో నడిపించే సత్తా వైఎస్ కుటుంబానికి ఉంటుందని భావించిన ఏఐసిసి… వైయస్ షర్మిలకు పిసిసి పగ్గాలు అప్పగించింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇక పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల వైపు దూసుకెళ్లేలా షర్మిలా రాజకీయ వ్యవహాలకు పదును పెడతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అధికారం కోసం గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు టాపిక్ పధక రచనలో తలమునకులై ఉన్నాయి. ఈ రెండింటిని ఢీకొని కాంగ్రెస్ పార్టీకి .పునర్వైభం తీసుకుని రావడంలో షర్మిలా ఎంతవరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే కాంగ్రెస్ కు షర్మిల కాయకల్ప చికిత్స చేయగలరా. వైసీపీతో ఆమీతూమీకి సన్నద్ధం.
కాంగ్రెస్ పార్టీ ఆశావాహులకు అభయ హస్తం అందిస్తుంది. పిసిసి చీఫ్ గా వైయస్ షర్మిల బాధ్యతలు స్వీకరించడంతో మంచి ఊపులో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. సరైన సమయానికి సరైన నాయకి వచ్చిందంటూ సంబరపడుతున్న హస్తం పెద్దలు ఏపీలో తమకు సాటెవరంటూ ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. ఓవైపు షర్మిల రాష్ట్రవ్యాప్త పర్యటన సాగిస్తుంటే మరోవైపు సీనియర్ నేతలు భవిష్యత్ ప్రణాళిక ముందుకు సాగుతున్నారు.ఇప్పటీకే కొంతమంది షర్మిల తో టచ్ లో ఉన్నారు.అలాగే ఇతర పార్టీలోని అసంతృప్తివాదులకు గాలం వేస్తున్న హస్తం పెద్దలు రండి రారండోయ్ పిలుపునిస్తున్నారు. సీటు గ్యారెంటీ.. గెలుపు బాధ్యత కూడా మోస్తామంటూ భరోసా కల్పిస్తున్నారు. సాంప్రదాయ ఓట్ల బ్యాంకు ను పెద్దలు పరుచుకుంటే మనదేరా అంటున్నారూ కాంగ్రెస్ అగ్రజులు. టిడిపి జనసేన వైసిపి పార్టీల దాగుడుమూతలపై విసిగి వేసారిన జనం ప్రత్యామ్నాయ కోసం ఎదురు చూస్తున్నారని ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకే భవిష్యత్తు ఉంటుందని నాయకులు భరోసా కల్పిస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ గెలుపు మాట ఎలాగున్నా ప్రధాన పార్టీల గెలుపోవటములపై ప్రభావం చూపించగలరని విశ్లేషకులు సైతం అంటున్నారు