Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుకవిత్వం, జానపదం జాతి జీవనాడులు

కవిత్వం, జానపదం జాతి జీవనాడులు

  • ఎస్వీ యూనివర్శిటీ పాలకమండలి సభ్యురాలు భూమన సుగుణ
  • శ్రీశ్రీ కళావేదిక తిరుపతి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

రాయలసీమ (ఎస్వీయూ-తిరుపతి)
కవిత్వం, జానపదం రెండూ జాతి అభ్యున్నతికి జీవనాడులని ఎస్వీ యూనివర్సిటీ పాలకమండలి సభ్యురాలు, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఆచార్య భూమన సుగుణ అన్నారు. ఆదివారం
శ్రీశ్రీ కళా వేదిక తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హల్లో ఘనంగా సంక్రాంతి సాహిత్య, సాంస్కృతిక సంబరాలు నిర్వహించారు.
శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షులు డా. కత్తిమండ ప్రతాప్ మార్గనిర్దేశనంలో,
శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర కార్యదర్శి ఆరవ జయపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కవి సమ్మేళనం, జానపద గేయాలాపనలు వైభవంగా సాగాయి. తిరుపతి జిల్లా వ్యాప్తంగా అనేక మంది కవులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగింపు సభకు శ్రీశ్రీ కళావేదిక జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు అధ్యక్షత వహించారు. ఎస్వీ యూనవర్సిటీ పాలకమండలి సభ్యురాలు, శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఆచార్య భూమన సుగుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కవిత్వానికి సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి వుందన్నారు. జానపదం అంతకన్నా ఎక్కువ ప్రభావం చూపి సమసమాజ స్థాపన చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నదన్నారు. శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర కార్యదర్శి ఆరవ జయపాల్ మాట్లాడుతూ, కనుమరుగవుతున్న జానపద సంపదను పరిరక్షించేందుకు శ్రీశ్రీ కళావేదిక ద్వారా కృషి చేస్తున్నామన్నారు.
పలువురు కవులు, కళాకారులకు ఘన సన్మానం :
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు రచయితలు, కవులు, కళాకారులను ఈ సందర్భంగా ఎస్వీ యూనవర్సిటీ పాలకమండలి సభ్యురాలు, శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఆచార్య భూమన సుగుణ సత్కరించారు. తిరుపతి జిరసం వ్యవస్థాపక అధ్యక్షులు సాకం నాగరాజు, సుప్రసిద్ధ నవలా రచయిత వి.ఆర్. రాసాని తదితరులు కవి సమ్మేళనం జానపద కళాకారులకు జ్ఞాపిక, ప్రశంసాపత్రం, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి సంగిశెట్టి శ్రీనివాస్, ప్రముఖ జానపద కళాకారుడు రెడ్డెప్ప, యువశ్రీ మురళి, డా. బత్తల అశోక్ కుమార్, ఆకుల మల్లేశ్వర రావు, సి. నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article