Wednesday, April 30, 2025

Creating liberating content

రాజకీయాలుకళారంగలో కలుపు మొక్కలను పెకలించే దెవరు…?

కళారంగలో కలుపు మొక్కలను పెకలించే దెవరు…?

ఈ కలుపు మొక్కలకు కాపలా ఉన్నదెవరు…
కాసులకోసం కలువుమొక్కలని కనికరిస్తారా…
నాటి మొక్కలే నేడు మహా వృక్షాలై నాట్యమాడుతుంటే..
నవ్విపోతుందిగా నాటకరంగం…
పరువు పోతుంది గా పాటల ప్రపంచం
పేరుకే పెద్ద మనుషుల్లాగా ..చేసేది పాడు పనులా…
పాడు పనులు చేస్తూ ప్రసంగాలు ఇస్తుంటే..
ఫ్రక్కున నవ్వుతోంది ఈ పాడు లోకం…
పసికూన ప్రాణాలపై పరిహాసం…
పాటలు పాడినప్పుడు తెలియలేదా..
నీవు శాస్వితం…మిగిలిన వారు ఆశాస్వితమా..
ఏది శాస్వితం…ఏది ఆశాస్వితం..
ఎందుకింత నీచం…దేనికోసం ఈ దిగజారుడు తనం..
ధనం మూలం ఇదం జగత్ కాదా…
కాసులతో కాలాన్ని కొనగలరా…
బుద్ధి కర్మానుసారిణి మరిచితిరా…

(కృష్ణ సింధు,ప్రజాభూమి ప్రతినిధి,కల్చరల్)
ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, ఆ విషయం తెలిసినా కూడా ఎంతో మంది విపరీతమైన అత్యాశతో జీవిస్తారు. తామే బావుండాలని, తామే డబ్బు సంపాదించాలని, తమకే సంతోషం దక్కాలని విపరీతమైన స్వార్థంతో ప్రవర్తిస్తారు. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతమో? చెప్పడం కష్టమే.కాలం శాశ్వతం కాదు, ఈ క్షణం గడిచిపోతే తిరిగి తెచ్చుకోలేం. ఆ క్షణాన్ని కాసేపు ఆపలేం కూడా. ఇక వయసు గంటలు గడుస్తున్న కొద్దీ గతం కన్నా ఓ గంట వయసు పెరిగి కూర్చుంటుంది. ప్రేమ శాశ్వతమంటారు… నిజానికి ప్రేమ కూడా శాశ్వతం కాదు, భార్యని అమితంగా ప్రేమించిన భర్త, వారికి పిల్లలు పుట్టాక వారిని అధికంగా ప్రేమించడం మొదలుపెడతారు. ఇలా పరిస్థితిని బట్టి ప్రేమలో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఒక్కోసారి ఆ ప్రేమ పూర్తిగా చచ్చిపోయే క్షణాలు కూడా వస్తాయి.ఒక్కసారి పోయిన ప్రాణాన్ని వందల కోట్లు ఇచ్చిన వెనక్కి తెచ్చుకోలేం. యవ్వనంలో ఉన్న అందం… వయసు ముదిరాక పోతుంది. దాన్ని తిరిగి తెచ్చుకోవడం అసాధ్యం. అధికారంలో ఉన్నవారు గర్వంతో విర్రవీగిపోతారు కానీ, ప్రజల్లో తిరుగుబాటు వస్తే అంతే సంగతులు. కానీ అందాన్ని, డబ్బులు, అధికారాన్ని చూసి తెగ మిడిసిపోయే వారు ఎంతో మంది ఉన్నారు. శాశ్వతం కానీ అంశాలను తలకెక్కించుకుని… చుట్టూ ఉన్న వారిని చులకనగా చూసే వారు ఎంతోమంది ఉన్నారు.ప్రతి ఒక్క మనిషి ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చారు, మళ్లీ ఒంటరిగానే భూమిలో కలిసిపోతారు. మధ్యలో ఈ అందం, అధికారం, డబ్బు, మదం అవసరమా? అంటే వాటి చుట్టే ఈ ప్రపంచం తిరుగుతుంది.రూపాన్ని,రూపాయిని చూసి మురిసిపోతే అవి మనల్ని వదిలి వెళ్లే రోజు ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఈ మారిపోయే లోకంలో ఏదీ శాశ్వతం కాదు. తేదీలు మారుతున్నా, ఏళ్లు గడుస్తున్నా, కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటే జీవితంలో ఎవ్వరూ శాశ్వతం కాదని. సాధించిన విజయాలు, ఘనతలు మాత్రం మరణానంతరం కూడా కొన్ని తరాలు గుర్తు పెట్టుకుంటాయి. ఐన్ స్టీన్ బల్బు కనిపెట్టి వంద ఏళ్లు దాటి పోయినా ఇప్పటికీ మనం ఆయన్ని మర్చిపోలేకపోతున్నాం. అలాగే మానవాళికి చేసే మంచి మాత్రం ఎక్కువ కాలం పాటూ మీరు ఉనికిలో లేకపోయినా నిలిచే అవకాశం ఉంది.కర్మ ఫలం అంటే ఒక పంట లాంటిది. విత్తనాలు నాటగానే పంట చేతికి రానట్లే. కర్మ ఫలాలు కూడా కాలక్రమంలోనే లభిస్తాయి తప్ప, తక్షణం లభ్యం కావు. దుర్మార్గులు తమ కర్మ ఫలాలను అనుభవించే సంఘటన సమయం ప్రపంచం విస్మ యం చెందేలా ఉంటాయి. పుట్టిన ప్రతి మనిషీ ఒక్క క్షణం కూడా ఏదో ఒక కర్మ చేయకుండా ఉండలేడు. అంటే మనిషికి పుట్టుకతోనే కర్మ కూడ వెంట వస్తుందని తాత్పర్యం. మనిషి జీవితంలో ప్రధా నంగా మూడు విధాలైన కర్మల్ని ఎదుర్కొంటూ ఉంటాడు.మనిషి చేసే కర్మలు భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలకు సంబంధించినవై ఉంటాయి. మనిషి గతంలో చేసిన పుణ్య పాపా లను ‘సంచిత కర్మలు’గా పిలవబడతాయి. చేసిన పాపాలుగానీ, పుణ్యాలుగానీ పక్వమై మనిషి అనుభవించడానికి సిద్ధంగా ఉంటే అవి ”ప్రారబ్ద కర్మ”లు అంటారు. తెలిసో- తెలియకో ఎవరైనా మంచో- చెడో చేసి వాటికి తనను తాను బాధ్యుడుగా భావించినప్పుడు అది పాప కర్మో, దుష్కర్మో లేక సత్కర్మగానో పిలవబడుతుంది. కర్మానుసారం అతడు తగిన ఫలితం అనుభవించవలసి వస్తుంది.కర్మ అనంతమైనది. అందుకే తన పరిమిత జీవిత కాలంలో ఎవరూ కర్మని సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. అయితే విషయాన్ని స్థూలంగా అర్థం చేసుకోవడమే సాధ్యం కాదు. అంటే ఆ సూక్ష్మంగా కర్మని అర్థం చేసుకోవడం అన్నది ఒక నిరంతర ప్రక్రియ.ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా మనం చేసే కర్మలవల్ల అనేక ఒత్తిళ్లకు లోనవుతుంటాం. అవి భావోద్వేగాల ఊయలలో ఊపుతూ ఉంటాయి. వీటివల్ల చాలాసార్లు మానసిక ప్రశాంతత కరువవుతుంది. లక్ష్య సిద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలని, అంతర్మథనం జరుగుతుంది. త ద్వారా మళ్ళీ తక్షణ కర్మల ఒత్తిడికి అధికంగా లోనవుతాం.చిత్తంలో నుంచి కర్మ తత్త్వం పుడుతుంది. కాల్చిన ఇనుప చువ్వలు రెండూ, ఒక దానితో ఒకటి కలుస్తాయి. అలాగే పరిశుద్ధ మైన చిత్తం పరిశుద్ధమైన కర్మ తత్త్వంతో కలుస్తుంది. కర్మ ధ్యాన యోగం చిత్తాన్ని ఏకాగ్రతలో ఉంచడానికి దోహదపడుతుంది. దైవత్వ సాధన ఆత్మశక్తి శోధనకు అది సోపానమవుతుందని కర్మ ధ్యాన యోగం నిర్దేశించింది. మౌనం మానసికమైతే దాన్నుంచి కర్మ ధ్యానం సులభతరమవుతుంది. వేదాలు కర్మలు చేయమంటా యి. దానికి భిన్నంగా కర్మలు త్యజించమని కూడ అంటుంది.బాల్యావస్థలో తల్లిదండ్రులు, గురువులు పెద్దలు మన జీవన శైలికి మెరుగులు పెట్టడానికి అనేక సత్కర్మలు నేర్పుతుంటారు. వాటిని మహా ప్రసాద కర్మలుగా భావించి స్వీకరించిన వారందరూ జీవితంలో ప్రయోజకులైన వారే. కర్మల్ని ఆచరించే ఆలోచనలను మార్చుకుంటూ కొత్తరకం సత్కర్మలు చేస్తూ, మనం సంకల్పించుకున్నది సాధించుకోవాలి. అది చూసి ముందు తరం ప్రేరణ పొం దాలి. పిన్న వయసులోనే గొప్ప కర్మలు చేయాలనే భావాలు ఎలా కలిగాయా అని వాళ్ళు ఆశ్చర్యపోవాలి.చాలామందికి ఎదుటి మనిషి చేసే సత్కర్మల్లో తప్పులు వెతు కుతూ రంధ్రాన్వేషణ చేసే అలవాటు అధికంగా ఉంటుంది. గురి వింద గింజ తన కింద నలుపు తెలియనట్లు వీరు తమ తప్పును తెలుసుకోరు. ప్రతి ఒక్కరికి అంతరాత్మ అనేది ఉంటుంది. అది ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. అప్పుడే తప్పు చేసిన వ్యక్తి పశ్చాత్తాప హృదయంతో తన ప్రవర్తన సరిదిద్దుకునే ప్రయ త్నం చేయాలి. మనలోని భగవదున్మత్తత, ప్రేమ, పరితాపం, ఇత్యాది కర్మలు ఏ క్షణంలో ఏ కోణంలో వాటిని మనకు అందిస్తుందో తెలీదు. భగవంతుని పట్ల భక్తి అధికమయ్యేకొలదీ ఆయన తాలూకు పరిమళాన్ని పంచేందుకు కర్మ ల్లో సర్వకాల, సర్వావస్థల్లో అవకాశం ఉం టుంది. చక్కగా కర్మ చేయడం ఒకకళ.ఇతరులను నొప్పించక కర్మ చేయాలి.కానీ ఇలా ఎందుకు ఆలోచించడం లేదో ఆ పరమాత్మకే తెలియాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article