వేంపల్లె :స్థానిక పట్టణంలోని వైయస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ప్రత్యేక శిబిరం కుమ్మరాంపల్లి నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా రెండవ రోజు కుమ్మరాంపల్లి లో నివాసం ఉంటున్న ప్రజలకు ఓటు హక్కు వినియోగం పై అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చెరసాల యోగాంజనేయులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ఆఫీసర్ డాక్టర్ సి. మల్లేశ్వరమ్మ మాట్లాడుతూ ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేసి ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని ప్రజలకు తెలియజేశారు. ఇందులో భాగంగానే డాక్టర్ ఎం.ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏర్పడటంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఓటు హక్కు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్కూల్ హెడ్ మాస్టర్ రెడ్డి మాలతి మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.