Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుఓటు హక్కు పునాదిరాయి వంటిది

ఓటు హక్కు పునాదిరాయి వంటిది

ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి కె.కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి ఉపన్యాసం

కామవరపుకోట                                   :ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఓటు పునాదిరాయి వంటిదని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశ్వర అన్నారు.స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో "భారతదేశంలో ఓటర్ల ప్రవర్తన”అనే అంశంపై “అతిథి ఉపన్యాసం” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎం మల్లేశ్వరరావు ప్రసంగిస్తూ ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి వివరించారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడు కె హరిప్రసాద్ ప్రసంగిస్తూ ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది వంటిదని పేర్కొంటూ ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎం మల్లేశ్వరరావు ఐ క్యూ ఏసీ కో ఆర్డినేటర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు పొలిటికల్ సైన్స్ విభాగం అధ్యాపకుడు ధారావతు మల్లేష్, వి.శ్రీనివాస్, ఎం ఉషారాణి, కె ఇందిరా కుమారి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article