కామవరపుకోట
ఏలూరు పార్లమెంట్ తో పాటు ఏడు నియోజకవర్గాలు కూడా జగనన్నకు గిఫ్టుగా ఇద్దామని ప్రస్తుతం ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ అన్నారు.
ఏలూరు పట్టణం లో స్థానిక పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబు ఏలూరు జిల్లా లో నూతనంగా నియమించిన పార్లమెంట్ ఇంచార్జి కారుమూరి సునీల్ కుమార్ అలాగే పోలవరం ఇంచార్జి రాజ్యలక్ష్మి , చింతలపూడి ఇంచార్జి విజయరాజు వేదిక మీదుగా పరిచయం చేసి భారీ మెజారిటీ తో గెలిపిస్తాను అని హామీ ఇవ్వడం ద్వారా సభలో ఒక్కసారిగా ధన్యవాదాలు తో చప్పట్లతో మారుమ్రోగింది. సభలో ఆసీనులైన సునీలు విజయ రాజు రామలక్ష్మి ఒక్కసారిగా లేచి నిలబడి కోటగిరి శ్రీధర్ కు దండాలు పెట్టారు. ముగ్గురు కలిసి దండం పెట్టడంతో మరుక్షణంలో సభ అంత నిశ్శబ్ద వాతావరణ నెలకొంది. తేరుకున్న పార్టీ నాయకులు కార్యకర్తలు జై కోటగిరి అంటూ సభా ప్రాంగణం మారుమరోగే పోయింది. రానున్న రోజులు ఈ ఉత్సాహంతో గెలిచి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇవ్వాలని ఆయన వచ్చిన సభకులను కోటగిరి కోరారు.