Friday, May 2, 2025

Creating liberating content

Uncategorizedఏదిరా జర్నలిజం… ఎవడురా జర్నలిస్ట్

ఏదిరా జర్నలిజం… ఎవడురా జర్నలిస్ట్

*అక్రిడేసన్ ఉంటే జర్నలిస్ట్ అయ్యినట్లేనా…
*లారీ డ్రైవర్…తాపీ మేస్త్రీలకు కూడా అక్రిడేసన్స్ ఉన్నాయ్…
*అక్షరం ముక్కరాకపోయిన జర్నలిస్టే..
*అందుకేగా అడ్డంగా అరెస్ట్ చేయమని అదేశాలు…
*ఆర్థిక రాజధాని విశాఖ లో మంత్రి డోలా మౌఖిక ఆదేశాలిచ్చినట్లు ప్రచారం..
*ఆదేశాలు ఇచ్చారు అమలు చేసి తీరతార…
*అసలు ఎవరు కొసరు ఎవరన్నది ఎలా?
*అందరూ పాత్రికేయులే..అన్నీ పత్రికలే…!

  • పత్రికా ప్రమాణాలు తెలియక పోయిన పత్రికాది పతే..
  • బీల్డింగ్ ల దగ్గరికి వెళ్తే అరెస్ట్ చేస్తారా..
  • అసలు బీల్డింగ్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు..
  • ఆ బీల్డింగ్ లో అక్రమాలున్నాయా ఏమిటీ…
  • అక్రమ నిర్మాణాలు ఆపితే అడ్డగోలు వ్యవహారాలు ఉండవు గా…
  • అవినీతి అనేది వ్యవస్థ లో భాగమే అయిఉంటే…
    *లక్షల్లో జీతాలు … లంచాల కోసం లుచ్చా పనులు చేస్తుంటే …
    *నేతల్లో నీతి లేకపోతుంది… *రాతల్లోని నీతిని రాద్దాంతం చేస్తుంటే..
    *అక్షరానికి ఇక ఎన్ని అగచాట్లు వచ్చునో…
    (రామమోహన్ రెడ్డి)
    అందరూ శాఖాహారులయితే కుండలోని మాంసాహారం ఏమయిందో అన్న రీతిగా ప్రభుత్వాలు పత్రికా వ్యవస్థపై
    నేడు ప్రదర్శిస్తున్న తీరు పత్రికా లోకాన్ని మరింత పథనావస్థకు తీసుకెళ్లే విదంగా ఉందని చెప్పక తప్పడం లేదు.రోజు రోజుకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు పత్రికా వ్యవస్థను తీవ్ర గందరగోళం లో పడేసే విదంగా ఉండటం పత్రికలు చేసుకున్న దౌర్భాగ్యమని చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురించడం అత్యంత బాధాకరం.
    ఎవడు జర్నలిస్టు..ఏది జర్నలిజం అనే సహజ న్యాయం కరవవుతున్న పరిస్థితి కి పత్రికా వ్యవస్థ దిగజారి పోతుండడమనేది దారుణం.
    జర్నలిస్ట్ అంటే వార్తలను సేకరించి, పరిశోధించి, ప్రజలకు అందించే వ్యక్తి.
    జర్నలిస్టుల ప్రధాన లక్ష్యం ప్రజలకు సమాచారం అందించడం, వారిని అవగాహన కలిగించడం,పౌర సమాజంలో చర్చను ప్రోత్సహించడం.
    జర్నలిజం నీతి నిష్పాక్షికంగా తటస్థంగా ఉండాలని కోరుతుందా లేదా అనే దానిపై అనేక చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయి. జర్నలిస్టులు ఒక నిర్దిష్ట సామాజిక సందర్భం నుండిఅందులో భాగంగా వార్తలను ఉత్పత్తి చేస్తారనే వాస్తవం, మరియు వారు వృత్తిపరమైన నీతి నియమావళి ద్వారా మార్గనిర్దేశం చేయబడతారు. అలాగే అన్ని చట్టబద్ధమైన దృక్కోణాలను సూచించడానికి తమ వంతు కృషి చేస్తారనే వాస్తవం వాదనలలో ఉంది. అదనంగా, ఒక విషయం యొక్క సంక్లిష్టమైన మరియు ద్రవ కథనాన్ని తగినంత ఖచ్చితత్వంతో అందించగల సామర్థ్యం కొన్నిసార్లు విషయాలతో గడపడానికి అందుబాటులో ఉన్న సమయం, కథను చెప్పడానికి ఉపయోగించే మాధ్యమం యొక్క ఖర్చులు లేదా పరిమితులు మరియు ప్రజల గుర్తింపుల యొక్క పరిణామ స్వభావం ద్వారా సవాలు చేయబడుతుంది.ఇలాంటి జర్నలిస్టులు ఎందుకు నీచంగా చూడబడి అరెస్టు చేయండనే స్థాయికి దిగజారి బ్రతకాల్సిన పరిస్థితి దాపురించిందో ఆలోచన చేయలేక పోతుండడం అత్యంత బాధాకరం.
    పత్రికొక్కటున్న పదివేల సైన్యము, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజలకు రక్ష లేదు పత్రిక లేనిచో… ” అని చెప్పిన పత్రికా సైన్యాధ్యక్షుడు నార్ల వెంకటేశ్వరరావు. పత్రికను పైకి తేవడానికి నార్ల అనేక కొత్త ఒరవడులు ప్రవేశపెట్టారు.
    ఎడిటరైనవాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా’ అంటూ తోటి రచయితలనూ, భావి సంపాదకులనూ హెచ్చరించిన యోధుడు నార్ల. ముఖ్యంగా జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టేవారు నిజాయితీగా, నిర్భీతిగా ఉండాలని కోరేవాడు నార్ల. “నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా” అని చెప్పాడు.
    కానీ నేడు పత్రికల ముసుగులో పత్రికా విలేకరుల ముసుగులో కొంతమంది ఇతరులు దూరడం తో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.ఎవడు జర్నలిస్టు అనేది ఎలా దేనిని ప్రామాణికగా తీసుకోవాలో కూడా తెలియని వైచిత్రి ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నారు అధికార యంత్రాంగం. ఐడి కార్డు ప్రామాణికమా అంటే ట్యూబ్ లు అధికమై సైకిల్ ట్యూబ్ లారీ ట్యూబ్ లాగా సోషియల్ మీడియా ఎక్కువగా అయ్యి లోగోలు కనిపిస్తున్నాయి.ఇక అదే తరహాలో పిడీఫ్ రూపం లో వేల పత్రికలు వాట్సఫ్ గ్రూప్ లలో హల్చల్ చేస్తున్నాయి.
    ఒక పత్రిక అంటే ఎలా ఉండాలో తెలియని వారు కూడా ఎడిటర్ లని తాము కూడా పత్రికాధిపతులమని చెలామణి అవుతూ కనీస ప్రమాణాలు పాటించకుండా ఐడి కార్డులు లారీ డ్రైవర్లకు,ఆటో వాలకు,తాపీ మెస్త్రీ లకు ఇస్తుంటే కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు అక్రిడేసన్స్ కుడా లారీ డ్రైవర్ కు స్టాపర్ అని బ్యూరో అని ఇచ్చి కాయ్ రాజా కాయ్ అంటూ వసూళ్లకు పంపు తుంటే అక్రమ బీల్డింగ్ లు,పిడిఎస్ రైస్ ,కల్తీ నెయ్యి ,ఉప్పు,పప్పు ,ఇసుక మట్టి ఇలా అనేక రకాల మాఫియాలోకి దూరి వారు కూడా వ్యాపారం కి అండగా ఉంటూ రాజ్యమేలుతూ ఉన్నారు.
    ఒక విలేకరుల సమావేశం పెడితే కుర్చీలు కూడా వేయలేని స్థితిలో ఆయా నేతలు కానీ అధికార వ్యవస్థలు ఉంటున్నాయంటే మీడియా అన్నది ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయో అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది.
    అక్షరం ముక్కరాదు కనీసం తన జేబులో ఉన్న ఐడి కార్డు ఇచ్చిన సంస్థ పేరు స్పష్టంగా ఇంగ్లీషు కాదు తెలుగులో కూడా రాయలేని మేధావి వర్గాలు మీడియా ముసుగులో చేస్తున్న అరాచక పనుల వల్ల నేడు అరెస్ట్ చేసేయ్యండని ఆదేశాలు ఇచ్చే స్థాయికి పరిస్థితి దిగజారి పోయింది. గత రెండు రోజుల క్రితం విశాఖలో ఆజిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి నేరుగా జిల్లా కలెక్టర్ కే మౌఖిక ఆదేశాలు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.ఉమ్మడి విశాఖ జిల్లాలో బీల్డింగ్ నిర్మాణ దారుల విషయంలో తలెత్తిన వివాదం ముదిరి నేరుగా మంత్రే అరెస్ట్ చేయండని అనే స్థాయికి పరిస్థితి దాపురించడం కేవలం జర్నలిస్టుల ముసుగులో యుర్నలిస్టులు చేస్తున్న నీచమైన పనుల వల్లే అన్నది వాస్తావం.ఒక విశాఖపట్నం లోనే కాదు విజయవాడలో మరి దారుణంగా పరిస్థితి దిగజారి పోయిందని చెప్పాలి.పంపకాల్లో తేడా లు ,ఆధిపత్యం లో తేడాలు వచ్చి ఏకంగా నీచాతి నీచమైన స్థాయికి దిగజారి కుటుంబ విలువలు కూడా పక్కన బెట్టి కేసులు ఒకరి మీద ఒకరు పెట్టుకునే స్థితికి వచ్చారంటే జర్నలిజం అనేది ఏ స్థాయికి దిగజార్చు తున్నారో అర్డం చేసుకోవాలి.
    ఓ బిల్డర్ వద్ద తలెత్తిన వివాదం కొన్ని కేసుల వరకు వెళ్లి అర్ధరాత్రి వరకు స్టేషన్లో పంచాయితీలు చేసుకుంటే కొందరు బెజవాడ ను శాసించేది మేమే అని నకిలీ అక్రిడేసన్స్ కలిగి చెలామణి అవుతున్న దురదృష్టకర స్థితిలో కి జర్నలిజాన్ని జర్నలిస్టు ల ముసుగులో ఉన్న లారీ డ్రైవర్ లు,తాపీ మెస్త్రీ లు తీసుకెళ్లి పోయారన్నది అక్షర సత్యం గా నిలుస్తుంది.
    ఒకనాడు ఒక కథనం వస్తే మంత్రి పదవులకే ప్రమాదం వచ్చేది.సీట్లు కూడా గల్లంతయ్యేవి.కానీ లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా లంచాల కోసం లుచ్చా పనులు చేస్తున్న కూడా వాటిని ఎత్తి చూపిన కథనాలను రాసే వారినే కేసుల్లో ఇరికించే స్థాయికి పరిస్థితి ఏర్పడింది. నేడు ఎంతో మంది నేతలు నీతి తప్పిన పనులు చేస్తున్న జర్నలిజం లో నీతి తప్పిన వారు అధికం అవ్వడంతో పత్రికల పై బురదజల్లడం ,పాత్రికేయులపై దాడి చేయడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పటికయినా ప్రబుత్వం నిర్దిష్ట మైన విధానంతో ఒక కార్యాచరణ రూపొందించి నకిలీలు ఏరివేత చేపట్టి జర్నలిజం లో ఉన్న యర్నలిజాన్ని కూకటి వ్రేళ్ళతో పెకిలించి వేయాలని పత్రికా లోకమ్ కోరుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article